హీరోయిన్స్ తాగుడు వల్ల పాడయిపోతారనడానికి మహానటి సావిత్రిని ఉదాహరణగా చెబుతారు. గ్లామర్ తగ్గిపోయాక తాగుడుకు అలవాటయ్యిందని చెబుతారు. ప్రస్తుతం అందాల హీరోయిన్ నయనతార బీరు తాగుతోందా అంటూ తమిళంలో గుసగుసలాడుకుంటున్నారట. వివరాల్లోకెళితే ఏదో తమిళ సినిమా కోసం బీరు సీసా పట్టుకుని కార్లో వెళుతూ నటించిందట. దాంతో నయనతార బీరు తాగుతోంది అంటూ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసేశారట.
అయితే తాగి తందనాలాడిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో లేకపోలేదు. గతంలో తప్పగాగి అల్లరి చేస్తూ త్రిష పోలీసులకు దొరికిపోయింది. ఇక హిందీ హీరోయిన్స్ అందరూ మందు కొట్టేవాళ్లే తప్ప మజ్జిగ తాగే వాళ్లు తక్కువ. కాబట్టి నయనతారకు డ్రింకింగ్ అలవాటు ఉందో లేదో కానీ ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో ఒత్తిడికి గురి చేసేవేనని చెబుతుంటారు.
ప్రేమలూ, ప్రియుడి తిరస్కారాల్లాంటివి ఎన్నో చవి చూసిన నయనతార తాగకుండా ఉంటుందా అనే సందేహంతో ఉండేవాళ్లు కూడా లేకపోలేదు మన సొసైటీలో.