ఆ ఇద్దరు ప్రముఖ నటులదీ మామా అల్లుళ్ల వరస. ఒకాయన రెండో ఆయనకు కన్యాదానం చేశాడు. సొంత కూతురిని కాదు ఇవ్వలేదు కానీ.. వాళ్లిద్దరూ మామా అల్లుళ్లు అవుతారంతే. చాలా సినిమాల్లో కలిసి నటించారు కూడా. అయితే వాళ్లిద్దరికీ మాత్రం ఒకరంటే మరొకరికి పడటం లేదు. వీళ్ల మధ్య విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. సదరు మామగారు ఇప్పుడు తన అల్లుడి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. మీడియాకు ఇచ్చే వ్యక్తిగత ఇంటర్వ్యూల్లో ఆ నటుడు తన అల్లుడి ప్రస్తావన తీసుకు వచ్చే సరికి మొహం మాడ్చేస్తాడు. ఆయన ప్రస్తావన ఎందుకు? అంటూ మండి పడతాడు.
మరి సినిమా నటుల వ్యక్తిగత ఇంటర్వ్యూలు అంటే.. వారి బంధాలు, బంధుత్వాల గురించి కూడా అడగడం సహజమే. అయితే ఆయన మాత్రం దానికి ఇష్టపడడు. తన వ్యక్తిగతానికి సంబంధించి ఇతర విషయాలను సదరు సీనియర్ నటుడు బాగానే చెబుతాడు. తను లేటు వయసులో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నానని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని కూడా చెబుతాడాయన. ఇది వరకూ ఒక ప్రముఖ నటీమణిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడాయన. ఆమె ఏమో ఆయనను తిడుతుంది. మట్టిని తీసుకొచ్చి మాణిక్యంగా మార్చానన్న కృతజ్ఞత కూడా ఆయనకు లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారామె.
ఆయన, ఆమె కలిసి ఇంకో హీరోకి కన్యాదానం చేశారు. అత్తామామలు అయ్యారు. విశేషం ఏమిటంటే.. వీళ్ల అల్లుడు మాత్రం వీళ్లను అభిమానిస్తాడు. వాళ్లిద్దరూ తనకు కన్యాదానం చేశారని గొప్పగా చెబుతాడు. వాళ్లపై అభిమానాన్ని ఆ విధంగా కురిపిస్తాడాయన. అయితే సీనియర్ యాక్టర్ కు మాత్రం అల్లుడి ప్రస్తావన అంటే.. బీపీ తెప్పిస్తుంది. మరి ఇంతగా విబేధాలకు కారణాలు ఏమిటంటే.. ఆస్తులకు సంబంధించిన వివాదాలే అని సమాచారం.