టాలీవుడ్ అంటేనే సెంటి మెంట్లు ముందు పుట్టి, ఆపై సినిమాలు రెడీ అవుతాయి. ఇప్పుడు నాగ చైతన్యకు సంబంధించినంత వరకు ఓ అనాలసిస్ బయటకు వచ్చింది. అభిమానులు ఊరికనే వుండరు కదా..సినిమాల మీద, సినిమా వ్యవహారాల మీద థీసిస్ లు చేసేస్తారు. అలాంటిదే ఇదీనూ.
నాగ చైతన్యకు పొడుగు హీరోయిన్లు అచ్చిరారు..అలాంటి హీరోయిన్లతో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాపే. ఇదీ కొత్తగా వినిపిస్తున్న థీసిస్. తోలి సినిమా..రాధ కుమార్తె కార్తీక..ఏ రేంజ్ పొడవో చెప్పనక్కరలేదు కదా..సినిమా ఫలితమూ తెలిసిందే. మొన్నటికి మొన్న కృతిసనన్..ఇంతా అంతా పొడవు కాదు…మరి పూజా హెగ్డే… అమలాపాల్.. వీళ్లందరితో వచ్చినవి ఫ్లాపులో, ఏవరేజ్ లో..అంతే కానీ హిట్ లు అయితే కాదు.
మరి పొట్టి అయిన సమంత, తమన్నా బాగానే కలిసి వచ్చారు.ఇంతకీ విషయం ఏమిటంటే, ఇప్పుడు లేటెస్ట్ గా శృతి హాసన్ ను తీసుకున్నాడు. ఆమె కూడా పొడవే.. మరి రిజల్ట్ ఏమవుతుందో చూస్తే, అప్పుడు థీసిస్ కంప్లీట్ అవుతుంది.