బ్రహ్మీకి డిక్టేటర్ షాక్

రోజులన్నీ మనవి కాదు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందానికి ఇప్పుడిప్పుడే తెలిసివస్తొంది. రోజుల వారీ అయిదు లకారాల రేట్లు, ఇంకా అనేకానేక డిమాండ్లు. సినిమా జనం భరిస్తూ వస్తున్నారు. అయితే రాను రాను కొత్త టాలెంట్…

రోజులన్నీ మనవి కాదు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందానికి ఇప్పుడిప్పుడే తెలిసివస్తొంది. రోజుల వారీ అయిదు లకారాల రేట్లు, ఇంకా అనేకానేక డిమాండ్లు. సినిమా జనం భరిస్తూ వస్తున్నారు. అయితే రాను రాను కొత్త టాలెంట్ వస్తోంది. ఇప్పటి వరకు వున్నవాళ్లు కూడా అవకాశం వస్తే టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. 

మొన్నటికి మొన్న లౌక్యం సినిమాలో పృధ్వీ కూడా అలాగే ఓవర్ నైట్ ఇమేజ్ ను డబుల్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు ప్లస్ అయింది. కోన వెంకట్, గోపీ మోహన్ టీమ్ మళ్లీ పృధ్వకి తమ తరువాతి వెంచర్ డిక్టేటర్ లో మాంచి క్యారెక్టర్ ఇచ్చేసారు. అది కాదు అసలు విషయం. ఆ క్యారెక్టర్ తయారుచేసింది బ్రహ్మీ కోసమట. 

కానీ ఆయన డిమాండ్ లు చూసి, ఇలా కాదు, కొత్తగా ట్రయ్ చేద్దాం అని, పృధ్వీకి అదే క్యారెక్టర్ ఆఫర్ చేసేసారట. బాలయ్య-శ్రీవాసు కాంబినేషన్ లో తయారవుతోందీ సినిమా. ఇక్కడ మరొసారి పృధ్వీ ప్రూవ్ అయిపోతే, ఇంక రేంజ్ పెరిగిపోవడం ఖాయం. ఆ సంగతి అలా వుంచితే బ్రహ్మీ మార్కెట్ ఇప్పటికే చాలా తగ్గింది. అది గమనించి అయినా ఆయన తన రేటు తగ్గించడం మంచిదేమో?