శ్రీమంతుడు ట్రయిలర్ ఎలా వుంది?

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్, కొరటాల శివలాంటి మాస్ డైరక్టర్ కాంబినేషన్ లో సినిమా వస్తోందంటే, ఇలా అలా వుండవు అంచనాలు. అలాంటి సినిమా ట్రయిలర్ వచ్చిందంటే, ఎలా వుండాలి..ఓ రేంజ్ లో…

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్, కొరటాల శివలాంటి మాస్ డైరక్టర్ కాంబినేషన్ లో సినిమా వస్తోందంటే, ఇలా అలా వుండవు అంచనాలు. అలాంటి సినిమా ట్రయిలర్ వచ్చిందంటే, ఎలా వుండాలి..ఓ రేంజ్ లో వుండాలి. కథ కాన్సెప్ట్ చెప్పక్కరలేదు. కనీసం ఎగ్జయిటింగ్ గావుండాలి. కానీ ఆ  విషయంలో శ్రీమంతుడు ట్రయిలర్ వీకే. ఈ మాట అభిమానులకు కోపం తెప్పించవచ్చు. కానీ వారికీ మనసులో ఎక్కడో వెలితి లేదూ అంటే మాత్రం నమ్మలేం.

హీరో క్యారెక్టర్ ఇండిపెండెన్సీ ని రివీల్ చేయడానికి స్టార్టింగ్ లో జగపతిబాబు రెండు డైలాగులు వేసాడు..వెనుక హీరో ఆన్సురు..సహజంగా ఇది చిన్నగానే వుంటుంది. జులాయిలో బన్నీ-తనికెళ్ల మధ్య సీన్ లా. కానీ ఆ చిన్న డైలాగే అదిరిపోవాలి. నన్ను కూడా నాకు నచ్చింది చేయనీండి అనేంత చప్పగా కాదు. కాస్త పంచ్ పడాలిగా. బేసిక్ గా కొరటాల శివ డైలాగ్ రైటర్ అన్నది మరిచిపోకూడదు.  ఊరు నుంచి చాలా తీసుకున్నారు. మొత్తం తిరిగిచ్చేయాలి..లేకుంటే లావైపోతారు..అన్న డైలాగ్ ఓకె. 

కానీ ఫైటింగ్ సీన్ కానీ, మిగిలిన సన్నివేశాలు కానీ, భలే వున్నాయ్ అనుకునే రేంజ్ లో అయితే లేవు. ఎప్పుడూ అదే విధంగా..అనే డైలాగు మహేష్ సినిమాలొ కామన్ అయిపోయింది.  ప్రతి సినిమాలోనూ ఈ డైలాగును పోలిన డైలాగు వినిపిస్తున్నారు. బ్యాన్ సన్ డైలాగ్ మాత్రం బాగుంది. పైగా బ్యాడ్ అంటే..అదో మాదిరి అనడం వెరైటీ. మొత్తం మీద ఒకటి రెండు రోజులకు ముందు మహేష్ అలా అలా నడిచివచ్చే టీజర్ విడుదల చేసారు. అదీ చప్పగానే వుంది. ఇప్పుడీ ట్రయిలర్. 

Click Here For Srimanthudu Trailer

అంటే హైప్ మరీ పెంచి, ప్రేక్షకుల అంచనాలు పెంచేసి, ఇబ్బంది పడడం ఎందుకని ఇలా చేస్తున్నారేమో అన్న అనుమానం కూడా కనిపిస్తోంది.  సినిమా విడుదలయ్యేలోగా మరో ట్రయిలర్ వచ్చే అవకాశం వుంది. అదెలా వుంటుందో చూడాలి. ట్రయిలర్ లో మాంచి డ్యూయట్ బిట్ లేని కొరతవుంది. అయితే రామ..రామ పాట బీట్ బాగానే వుంది..

మొత్తం మీద ఫ్యామిలీ, ఫీల్ గుడ్, ఎంటర్ టైనర్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో కలిపామని చెప్పడానికి ట్రయిలర్ తయారుచేసినట్లుంది తప్ప, ఓ మాంచి ట్రయిలర్ తయారుచేయాలని అనుకన్నట్లు మాత్రం  లేదు.