ఆ డైరక్టర్ తో బన్నీ సినిమానా?

బన్నీ అంటే హై ఓల్టేజ్ కరెంటు తీగ..అందనంత స్పీడుతో పరుగెత్తే రేసుగుర్రం. మరి శేఖర కమ్ముల అంటే నిదానంగా, విలాసంగా, ప్రవహించే గోదావరి. ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందా? కానీ అయ్యిందనే వార్తలు…

బన్నీ అంటే హై ఓల్టేజ్ కరెంటు తీగ..అందనంత స్పీడుతో పరుగెత్తే రేసుగుర్రం. మరి శేఖర కమ్ముల అంటే నిదానంగా, విలాసంగా, ప్రవహించే గోదావరి. ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందా? కానీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల శేఖర్ కమ్ముల మాంచి లైన్ తో అల్లు అర్జున్ ను కలిసినట్లు, విని, ఇంప్రెస్ అయి, చేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ కాస్త డిఫరెంట్ మూవీ చేద్దామనేనా అనుకుని వుండాలి. లేదా శేఖర్ కమ్ముల అల్లు అర్జున్ కు సరిపడా మాంచి మాస్ సబ్జెక్ట్ అయినా తయారుచేసే పనిలో వుండివుండాలి,. వెయిట్ అండ్ సీ.