నిప్పులు చిమ్ముతూ.. పీఎస్‌ఎల్‌వీ మరో సక్సెస్‌.!

నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసింది పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అమ్ములపొదిలోని అత్యంత నమ్మకమైన వాహక నౌక ఇది. తాజాగా ఈ రోజు పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్‌ని ఇస్రో ప్రయోగించింది.…

నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసింది పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అమ్ములపొదిలోని అత్యంత నమ్మకమైన వాహక నౌక ఇది. తాజాగా ఈ రోజు పీఎస్‌ఎల్‌వీ సీ-27 రాకెట్‌ని ఇస్రో ప్రయోగించింది. అత్యంత అధునాతనమైన నావిగేషన్‌ వ్యవస్థ కోసం రూపొందించిన ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ-27న రాకెట్‌ నింగికి తీసుకెళ్ళింది విజయవంతంగా.

మొత్తం 7 ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ ఉపగ్రహాహాల్ని ఇస్రో నింగికి పంపాల్సి వుంది. తద్వారా నావిగేషన్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం పంపింది నాలుగో ఉపగ్రహం. ఉపగ్రహ తయారీ కోసం 125 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన ఉపగ్రహాలూ ఈ ఏడాదిలోనే నింగిలోకి పంపుతారు. జీపీఎస్‌ తరహాలో భారత్‌ స్వయంగా అభివృద్ధి చేసుకున్న నావిగేషన్‌ వ్యవస్థ ఇది కావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.