ఆ నటుడి పేరు చిత్రంగా వుంటుంది. ఓ హీరో పేరు జోడించుకుని. అదే అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఓ హీరోగారికి ఆ పేరు నచ్చలేదట..ఇటీవల సదరు హీరో సినిమాలో ఈ నటుడు ఓ పాత్ర పోషిస్తున్నాడు..షూటింగ్ గ్యాప్ లో..పేరేంటీ అని అడిగాడట హీరో..చెప్పాడు ఇతగాడు..అదేం పేరు..నువ్వేం అతని పీఎనా? మరేమైనా రిలేషనా? ఇంకేమైనానా? తీసేయ్..ఆ తోక కట్ చేసేయ్? అన్నాడట.
అంతే కాదు, ఇద్దరూ కలిసి షూటింగ్ చేసినపుడల్లా ఇదే తంతు అంట. మళ్లీ అలా అని అదేదో సరదా వ్యవహారంగా సాగలేదు. కాస్త సీరియస్ గానే సాగినట్లు వినికిడి. పైగా ఆ హీరోకి ఏదైనా సరే నొక్కి చెప్పడం కన్నా, చెంపపై కొట్టి చెప్పడం కూడా కాస్త అలవాటు వుంది. ఈ ఇష్యూ కూడా అక్కడిదాకా వెళ్లిందని టాలీవుడ్ లో గుసగుస వినిపిస్తోంది.