విభిన్నమైన సబ్జెక్ట్ లు ఎంచుకునే యువ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ఇప్పుడు కొత్త సినిమా ఒకటి ఓకె చేసారట. దాంట్లో ఆయన జైలర్ పాత్రను పోషిస్తున్నారు. చాలా కాలం క్రితం అంటే సుమారు నలభై ఏళ్ల క్రితం హిందీలో శాంతారామ్ తీసిన దో ఆంఖే..బారా హాత్ సినిమాను తెలుగులో ఎన్టీఆర్ మాదైవం పేరిట చేసారు.
Advertisement
అందులో కరుడు కట్టిన ఖైదీలను సంస్కరించే జైలర్ గా ఆయన నటించారు. మళ్లీ జైలరు పాత్రలో మరే హీరో కనిపించలేదు. ఇన్నాళ్లకు నారా రోహిత్ ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఫిజిక్ ఫిట్ గా వుంచుకోరు కానీ, సబ్జెక్ట్ ల విషయంలో మాత్రం భలే పక్కాగా వుంటారు ఆయన.