ఇంకేం ‘పీకే’ ది వుంటుంది

రాజకీయాల్లో బేసిక్ రూలు ఒకటే. వాళ్లు అవునంటే మనం కాదనాలి..మనం కాదంటే వాళ్లు అవునంటారు. పికె సినిమా విషయం కూడా ఇలాగే తయారైంది. హిందూ మత వాదులు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్లు ఆ…

రాజకీయాల్లో బేసిక్ రూలు ఒకటే. వాళ్లు అవునంటే మనం కాదనాలి..మనం కాదంటే వాళ్లు అవునంటారు. పికె సినిమా విషయం కూడా ఇలాగే తయారైంది. హిందూ మత వాదులు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్లు ఆ సినిమాపై విరుచుకు పడుతున్నారు. బ్యాన్ చేయమంటున్నారు. 

దాంతో వీళ్లకు రివర్స్ లో నిల్చునే సమాజ్ వాదీ పార్టీ పాలనలో వున్న యుపి ప్రభుత్వం ఏకంగా ప్రోత్సాహకంగా వినోద పన్ను మినహాయించింది. అసలే యుపిలో భాజపా, ఎస్పీ పార్టీలు ఉప్పు నిప్పులా వుంటాయి. దీంతో అది మరింత రాజుకుంది. అసలే యుపిలో మతాల రాజకీయాలు ఎక్కువ. 

ఇలాంటి నేపథ్యంలో యుపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటే అది రాజకీయం కాక మరేమిటి? నిషేధం అనుకుంటే, ప్రోత్సాహకం ప్రకటించడం అంటే ఇంకే పీకె ది వుంటుంది