పెద్దోళ్లు నిర్మాతలే

సినిమాల్లో కొన్ని సిత్రాలు భలేగా వుంటాయి. ఇద్దరు కొడుకులు వుండి, వారసత్వంగా నటుడిగా మారాలనుకున్నా, చివరకు నిర్మాతలుగా సెటిల్ అవ్వడమే. మహేష్-రమేష్ ల్లో పెద్దవాడు రమేష్ బాబు ఆఖరికి నిర్మాతగానే సెటిలయ్యారు.  Advertisement అల్లరి…

సినిమాల్లో కొన్ని సిత్రాలు భలేగా వుంటాయి. ఇద్దరు కొడుకులు వుండి, వారసత్వంగా నటుడిగా మారాలనుకున్నా, చివరకు నిర్మాతలుగా సెటిల్ అవ్వడమే. మహేష్-రమేష్ ల్లో పెద్దవాడు రమేష్ బాబు ఆఖరికి నిర్మాతగానే సెటిలయ్యారు. 

అల్లరి నరేష్ , ఆర్యన్ రాజేష్ ల్లో పెద్ద వాడు రాజేష్ కూడా అంతే. అంతెందుకు అక్కినేని వెంకట్, నాగార్జునల్లో వెంకట్ నిర్మాతగానే మిగిలారు. వీళ్లందరికన్నా ముందు తరం నందమూరి త్రివిక్రమ రావు కూడా నిర్మాతే. సోదరుడు ఎన్టీఆర్ సూపర్ హీరో. 

విశాల్ అన్న కూడా అంతే. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ ప్రస్తుతానికి హీరోలే. చైతన్య అప్పుడే నిర్మాత వర్క్ నేర్చేసుకుంటున్నాడు. ఒక లైలా కోసం సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ అతనే చూసాడు.