ముకుంద సినిమా విడుదలయింది. మిక్స్ డ్ టాక్ వచ్చింది. ముందుగా జనం పెదవి విరిచినా, మెలమెల్లగా కాస్త కలెక్షన్లు పుంజుకుంది. ఓపెనింగ్స్ ఎలాగూ ఫరవాలేదు. కానీ చిత్రంగా సినిమా రెండోవారంలోకి వచ్చినా, దాన్ని కాస్త ఎత్తుదామని కానీ, మరి కాస్త ఏదో రకమైన పబ్లిసిటీ చేద్దామని కానీ ఎవరూ అనుకుంటున్నట్లు లేదు.
పాపం నాగేంద్ర బాబు తన కొడుకును హీరోను చేయగలిగాడు కానీ సినిమాను నిలబెట్టే ప్రయత్నం మాత్రం చేయలేదు. నిజానికి మెగా హీరోలు అనుకుంటే, ఈ సినిమాకు పబ్లిసిటీ పెద్ద కష్టమేం కాదు.
వాళ్లు మాట్లాడినా, స్పెషల్ షో వేసుకుని సినిమా చూసినా, ఇలా ఏదో ఒక హడావుడి చేసి, దాన్ని వార్తల్లో నిలబెడితే అదో విధంగా వుండేది. ఇప్పుడు ముకుంద బయ్యర్లకు అయిదు నుంచి పదికోట్లు కన్నం పడుతుందని టాక్.