పూనమ్‌కి బాగానే గిట్టుబాటవుతోంది

హాట్‌ హాట్‌ భామ పూనమ్‌ పాండే హైద్రాబాద్‌లో మకాం వేసింది నాలుగైదు రోజులుగా. ‘మాలిని అండ్‌ కో’ సినిమా ప్రమోషన్‌ ఓ పక్క, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఇంకోపక్క.. వెరసి పూనమ్‌ పాండేకి హైద్రాబాద్‌లో…

హాట్‌ హాట్‌ భామ పూనమ్‌ పాండే హైద్రాబాద్‌లో మకాం వేసింది నాలుగైదు రోజులుగా. ‘మాలిని అండ్‌ కో’ సినిమా ప్రమోషన్‌ ఓ పక్క, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఇంకోపక్క.. వెరసి పూనమ్‌ పాండేకి హైద్రాబాద్‌లో క్షణం తీరిక లేదు. సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చి, లాస్ట్‌ మినిట్‌లో న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో పెర్ఫామ్‌ చేసే అవకాశం దక్కించుకుంది పూనమ్‌ పాండే.

అంతేనా, పూనమ్‌ పాండేకి, ఇప్పుడు టాలీవుడ్‌ నుంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. సినిమా ప్రమోషన్‌ కోసం టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్న పూనమ్‌ పాండేపై పలువురు సినీ జనం దృష్టిపెట్టారట. సినిమా ప్రమోషన్‌కి బాగానే కలిసొస్తోంది గనుక, ఆమెతో ఐటమ్‌ సాంగ్స్‌ చేయించినా తమకు బాగా వర్కవుట్‌ అవుతుందని సినీ జనం కొందరు అనుకుంటున్నారట.

పూనమ్‌ పాండే లాంటి హాట్‌ భామతో ఐటమ్‌ సాంగ్స్‌ చేయించడం లేదంటే, హాట్‌ స్టోరీస్‌తో ఆమెని కీలక పాత్రలో పెట్టి సినిమాలు తీయడం ద్వారా ఆమె గ్లామర్‌ని క్యాష్‌ చేసుకోవాలనే ఆలోచన కలుగుతోంది చాలామందికి. ఆ మధ్య సన్నీలియోన్‌ కూడా ‘కరెంటు తీగ’ సినిమాలో హల్‌చల్‌ చేసి, ఆ సినిమా ప్రమోషన్‌ కోసం బాగానే పనిచేసింది. అయితే పూనమ్‌ పాండే స్టయిలే వేరు.

సన్నీ వచ్చి వెళ్ళింది.. పూనమ్‌ పాండే, తెలుగు సినిమాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పూనమ్‌ పాండేకి రెండు మూడు అవకాశాలు ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో విన్పిస్తుండడం గమనార్హం. ఆ అవకాశాలు ఆమెకు దక్కితే, బాగానే టాలీవుడ్‌లో పూనమ్‌ పాండేకి గిట్టుబాటు అయినట్లే.