డైరక్టర్ మారుతి కి ఆల్ ఆఫ్ ది సడెన్ నేమ్ వచ్చేసింది. దాంతో ఆయన తెలివిగా దానిని బ్రాండింగ్ గా మార్చుకున్నారు. చిన్న సినిమాలకు మారుతి ప్రెజెంట్స్ అని లేబుల్ ఇచ్చేసారు. దానివల్ల ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఏమేరకు అన్నది పక్కన పెడితే, బ్యాడ్ నేమ్ ఎక్కువ. కానీ అగ్రిమెంట్లు, కమిట్ మెంట్ లు వుండడంతో, ఇక అలా చూస్తూ చూస్తూ వదిలేయక తప్పలేదు. ఆ పాప ప్రక్షాళన అంతా భలే భలే మగాడివోయ్ తో జరిగిపోయింది. ఇప్పుడు మారుతి మళ్లీ క్లీన్ అండ్ గ్రీన్.
రచయిత, ఆల్ ఇన్ వన్ కోన వెంకట్ కూడా ఇప్పుడు ఇదే తరహా సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పెద్ద హీరోలు, నిర్మాతలు ఈయన బ్రాండింగ్ కోరుతున్నారు. కానీ దర్శకులు ఈయన సలహాలు, సూచనలు అలా విని, ఇలా పక్కన పెడుతున్నారు. బ్రూస్ లీ..అఖిల్ అలాగే అయిపోయాయట. కానీ మైనస్ ఖాతా మాత్రం కోనదే. త్రిపుర సినిమాకు నలభై లక్షలకు కోన బ్రాండ్ ఇచ్చినట్లు వినికిడి. ఆ సినిమాలో అంతకు మించి కోన పాత్ర లేదని తెలుస్తోంది. కానీ ఫెయిల్యూర్ కోన ఖాతాలోనే.
అందుకే ఇక కోన ఇకపై ఆచి తూచి తన పేరు వాడాలని, తన పేరును పూర్తిగా తన సినిమాలకే సక్రమంగా వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది,. శంకరాభరణం సినిమాకు ఆయన పూర్తిగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ అంటూ వేసుకుంటున్నారు. దానిపై బాగా కాన్ఫిడెన్స్ వుండడంతోనే అని వినికిడి. ఇకపై తన లైన్ లు, కథలు, వీలయినంతవరకు తానే చేసుకుంటా అంటున్నారట కోన.