వచ్చే నెలలో తన ఆటో బయోగ్రఫీని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దీనికి “గన్స్ అండ్ థింగ్స్'' అనే పేరును ఖరారు చేసి కవర్ డిజైన్ ను కూడా ట్విటర్ ద్వారా ఆవిష్కరించాడు ఆయన. ఈ పుస్తకంలో తన జీవిత విశేషాలు ఉంటాయని.. తన వివాదాస్పద వ్యాఖ్యాల వెనుక నేపథ్యాలు.. తనకు అండర్ వరల్డ్ తో.. అమ్మాయిలతో ఉన్న సంబంధాల గురించి ప్రస్తావించానని వర్మ ప్రకటించాడు. ఈ విధమైన ఇంట్రడక్షన్ తో వర్మ తదన పుస్తకం గురించి జనాల్లో ఆసక్తిని జనరేట్ చేయడానికి ప్రయత్నించాడు.
ఈ పుస్తకం ఇంగ్లిష్ లో ఉండబోతోందని తెలుస్తోంది. బహుశా ఇది వర్మ ఇది వరకూ రాసిన “నా ఇష్టం'' అనే పుస్తకానికి ఇంగ్లిష్ వెర్షనా? అనేఅనుమానాలు కూడా ఉన్నాయి. వర్మ బ్లాగులో రాసి పెట్టిన పోస్టులను ఐదేళ్ల క్రితం “సాక్షి'' వాళ్లు తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేశారు. ఆ తర్వాత వాటికి కొనసాగిపుంగా వర్మ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వ్యాసాలుగా రాశాడు. దానికి కొనసాగింపుగా జనాలకూ.. వర్మకు మధ్య కొశ్చన్ అండ్ ఆన్సర్స్ సీరిస్ నడించింది. వాటన్నింటినీ కలిపి “నా ఇష్టం'' అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకం సేల్స్ విషయంలో మంచి స్థాయిలో నే నిలిచింది. మరి ఇప్పుడు వర్మ అదే పుస్తకాన్నే ఇంగ్లిష్ లోకి ట్రాన్స్ లేట్ చేయించాడా?! లేక నిజంగానే సవివరమైన బయోగ్రఫీని రచించాడా?! అనేది తెలియాల్సి ఉంది.
వచ్చే నెలలో ఈ పుస్తకం విడుదల కాబోతోందని అంటున్నారు. మరి ఈ పుస్తకం ఎంతటి సంచలనంగా నిలుస్తుందో.. బాలీవుడ్ , టాలీవుడ్ ల కు సంబంధించిన ఎలాంటి విశేషాలను వెలుగులోకి తీసుకొస్తుందో చూడాలి!