ఆ కలం దేవా కట్టాదేనా?

బాహుబలిలో డైలాగులు అంతగా పడలేదు. ఇద్దరు రచయితలు రాశారు వాటిని. కానీ వార్ సీన్ లో కొన్ని డైలాగులు భలే పేలాయి.  …..నాతో వ‌చ్చేదెవ‌రు? నాతో చ‌చ్చేదెవ‌రు?..చావుని దాటుకొని నాతో బ‌తికేదెవ‌రు?….ఈ డైలాగులు రాసింది…

బాహుబలిలో డైలాగులు అంతగా పడలేదు. ఇద్దరు రచయితలు రాశారు వాటిని. కానీ వార్ సీన్ లో కొన్ని డైలాగులు భలే పేలాయి.  …..నాతో వ‌చ్చేదెవ‌రు? నాతో చ‌చ్చేదెవ‌రు?..చావుని దాటుకొని నాతో బ‌తికేదెవ‌రు?….ఈ డైలాగులు రాసింది దర్శకుడు దేవా కట్టానంట..అది ఆలస్యంగా బయటకు వచ్చింది. దర్శకుడు దేవా కట్టా మంచి రచయిత అని అందరికీ తెలిసిందే. ప్రస్థానం, ఆటో నగర్ సూర్యలో కాస్త ఆలోచింపచేసే డైలాగులు వుంటాయి. రాజమౌళి ప్రత్యేకంగా అడిగిమరీ రాయించుకున్నాడట బాహుబలి వార్ సీన్ కోసం దేవాతో. అందుకే టైటిల్ కార్డుల్లో థాంక్స్ కూడా చెప్పాడు. ఈ లెక్కన సెకండ్ పార్ట్ కు కూడా దేవా చేయి చేసుకుంటాడేమో? ప్రస్తుతం ఆయన డైనమేట్ సినిమాలో బిజీగా వున్నాడు.