అక్టోబర్ మూడోవారానికి రెడీ అవుతున్నాడు రామ్ చరణ్..తను, శ్రీను వైట్లతో చేస్తున్న సినిమాకు. అదే నెలలో కాస్త ముందుగానే రెడీ అయిపోతున్నాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ. అతగాడు క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కంచె. ఈ సినిమా కాస్త వైవిధ్యమైన కథతో, కాస్త దేశభక్తిని చాటిచెప్పే కథాంశంతో రెడీ అవుతోంది.
మరోపక్క పూరి సినిమా స్టార్ట్ అయింది. పూరి తక్కువోడు కాదు..చకచకా లాగించేసి, విడుదలకు రెడీ చేసేస్తాడు. రెండు సినిమాలకు కాస్త గ్యాప్ వుండాలంటే కంచెను అక్టోబర్ రెండు కు రెడీచేసి, విడుదల చేద్దామనుకుంటున్నాడట క్రిష్. మరోపక్క సాయి ధరమ్ తేజ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా రెడీ అవుతోంది. దాన్ని కూడా అక్టోబర్ కు రెడీ చేస్తే, ఆ నెల అంతటినీ మెగా ఫ్యామిలీ గుత్తకు తీసుకున్నట్లు అవతుంది.