బాల‌కృష్ణ సినిమాలో ఫ్లాప్ హీరోయిన్‌

బాల‌య్య ఎప్పుడు ఎవ‌రికి ఎందుకు అవ‌కాశాలిస్తాడో ఎవ్వరూ చెప్పలేం. అదేంటోగానీ ఫేమ్‌లో లేనివాళ్లు, అంత‌గా పేరు తెచ్చుకోని వాళ్లు బాల‌య్య సినిమాలో ఛాన్సులు కొట్టేస్తుంటారు.  Advertisement త్రిష ఫామ్‌లో లేదు. అయినా త‌న తాజా…

బాల‌య్య ఎప్పుడు ఎవ‌రికి ఎందుకు అవ‌కాశాలిస్తాడో ఎవ్వరూ చెప్పలేం. అదేంటోగానీ ఫేమ్‌లో లేనివాళ్లు, అంత‌గా పేరు తెచ్చుకోని వాళ్లు బాల‌య్య సినిమాలో ఛాన్సులు కొట్టేస్తుంటారు. 

త్రిష ఫామ్‌లో లేదు. అయినా త‌న తాజా సినిమా కోసం ఆమెను ఎంచుకొన్నాడు. ఇప్పుడు ఈ సినిమాలోకి మ‌రో ఫ్లాప్ హీరోయిన్ కూడా వ‌చ్చి చేరింది. త‌నే… అర్చన‌. ఈ తెలుగ‌మ్మాయి గ‌త కొన్నేళ్లుగా సింగిల్ హిట్ కోసం త‌ప‌న ప‌డుతోంది. కానీ ద‌క్కడం లేదు. 

ఇటీవ‌ల క‌మ‌ల‌తో నా ప్రయాణం అనే ఓ క‌ళాత్మక సినిమాలో న‌టించి, గ్లామ‌ర్ పంచింది. ఇప్పుడు బాల‌య్య సినిమా నుంచి పిలుపొచ్చింది. ఈ సినిమాలో అర్చన ఓ కీల‌క పాత్ర పోషిస్తోంద‌ట‌. మ‌రి ఈ సినిమాతో అయినా అర్చన జాత‌కం మారుతుందంటారా..??