కొన్ని సినిమాలు అర్భాటంగా మొదలై, అర్థాంతరంగా ఆగిపోతుంటాయి. చిరంజీవి అబు బాగ్దాద్ గజదొంగ సినిమా టైపులో అన్నమాట. కమల్‌హాసన్‌కీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. 1997లో కమల్ కథానాయకుడిగా మరుదనాయగన్ అనే చిత్రం మొదలైంది. క్వీన్ ఎలిజిబెత్ క్లాప్ కొట్టి ఆర్భాటంగా ఆరంభించిందీ చిత్రాన్ని.
అప్పట్లో నాలుగు నెలల చిత్రీకరణ కూడా జరుపుకొంది. ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఎంతో ఇష్టపడి, కష్టపడి రాసుకొన్న స్ర్కిప్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో కమల్ నిరాశకు లోనయ్యాడు. మళ్లీ ఆకథని ముట్టుకోలేదు. ఇన్నాళ్లకి ఈ స్ర్కిప్టుకి ప్రాణం వచ్చింది.
కమల్ మళ్లీ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి పూనుకొన్నాడట. లండన్‌ని చెందిన ఓ ఫైనాన్సియర్ పెట్టుబడి పెడతా.. అని ముందుకొచ్చాడట. దాంతో కమల్‌హాసన్‌లో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. తన కెరీర్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని కమల్ చెబుతున్నాడట.