ప్రపంచ క్రికెట్‌లోకి అడుగు పెడ్తూనే సంచలనాల్ని నమోదు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. హెలికాప్టర్ షాట్స్‌కి ధోనీ బ్రాండ్ అంబాసిడర్. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది అతడే. పాకిస్తాన్ ప్రధాని నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఇండియన్ క్రికెటర్ ధోనీ. అతని హెయిర్ స్టయిల్‌కీ, అతని ఆటతీరుకీ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ధోనీ ఒకప్పుడు తన బ్యాట్‌తో ప్రత్యర్థులకు ఓ రేంజ్‌లో సమాధానమిచ్చాడు. అయితే రానురాను ధోనీ ఆటతీరులో తేడా వచ్చింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్ మీద పెట్టిన దృష్టి, టెస్ట్, వన్డేలపై పెట్టలేదు ధోనీ. అలా ధోనీ ఆటతీరు అటకెక్కడంతో, అప్పటిదాకా అతనిపై ప్రశంసలు గుప్పించినవారే అతన్ని విమర్శించడం మొదలు పెట్టారు.
రెండేళ్ళ క్రితం ఓ సందర్భంలో ధోనీ, తాను రిటైర్ అయ్యేందుకు సమయం ఆసన్నమైందనీ, ఇంకొంతకాలం క్రికెట్ ఆడాలంటే, శరీరాన్ని ఫిట్‌గా వుంచుకోవాల్సి వస్తుందనీ రిటైర్‌మెంట్‌పై సంకేతాలిచ్చాడు. ఆ సంకేతాల్ని అప్పట్లో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, ఎవరూ అనుకోని రీతిలో టెస్ట్ క్రికెట్‌కి ధోనీ గుడ్ బై చెప్పేశాడు.
మామూలుగా అయితే, బ్యాట్‌తో సమాధానమిచ్చాకగానీ ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించి వుండకూడదు. తెరవెనుక ఏం జరిగిందో, ఏ ఒత్తిళ్ళు ధోనీపై బాగా పనిచేశాయో, ఎవరిమీదన్నా ధోనీ అసహనంతో వున్నాడో.. ఓ ఫెయిల్యూర్ టెస్ట్ సిరీస్‌తో ధోనీ టెస్ట్ క్రికెట్‌ని వీడుతున్నట్లు ప్రకటించాడు. ధోనీ రిటైర్‌మెంట్‌పై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.
మహా యోధుడు.. అనలేంగానీ.. జట్టుని విజయపథాన నడిపించిన ‘నాయకుడు’ ఓటమికి తలొగ్గడమే బాధాకరం.