సంసారం అంటే శృంగారం ఒక్కటే కాదు కదా

ప్రేమించడం దేనికీ.. అంటే పెళ్ళి కోసం అంటారు. పెళ్ళి దేని కోసం? అంటే శృంగారం కోసం అని ఒప్పుకోక తప్పదు. అయితే పెళ్ళి కేవలం సెక్స్‌ కోసమే కాదంటోంది బాలీవుడ్‌ అందాల నటి కరీనాకపూర్‌.…

ప్రేమించడం దేనికీ.. అంటే పెళ్ళి కోసం అంటారు. పెళ్ళి దేని కోసం? అంటే శృంగారం కోసం అని ఒప్పుకోక తప్పదు. అయితే పెళ్ళి కేవలం సెక్స్‌ కోసమే కాదంటోంది బాలీవుడ్‌ అందాల నటి కరీనాకపూర్‌. పెళ్ళితో ఖచ్చితంగా శృంగారం ముడిపడి వుంటుంది. 

అయితే అదొక పార్ట్‌ మాత్రమే. భర్తతో కలిసి ప్రయాణాలు చేయడం, కలిసి భోజనం చేయడం, అవీ ఇవీ మాట్లాడుకోవడం.. ఇద్దరం కలిసి వంట చేసుకోవడం.. దూరంగా వున్నప్పుడు ఫోన్స్‌ చేసుకోవడం.. ఇవన్నీ శృంగారం కన్నా ఎక్కువ ఆనందాన్నిస్తాయి.. అని చెబుతున్న కరీనాకపూర్‌ మాత్రం తన భర్త సైఫ్‌ అలీఖాన్‌తో ఎక్కువగా కబుర్లు చెబుతూ గడిపేస్తుందట. 

ఇద్దరూ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ ఆడుకుంటుంటే కలిగే అనుభూతి బెడ్‌ మీద కూడా రాదని చెబుతున్న కరీనాకపూర్‌ కోసం సైఫ్‌ అలీఖాన్‌ ప్రతి క్షణాన్నీ ఆనందంగా మార్చేస్తాడట. అందుకే తనకు అతనిపై అంత ఇది అని చెబుతుంది సోగ కళ్ళ సుందరి.