బూతు దారి వీడి.. మళ్లీ పాత దారిలోకి ఈ డైరెక్టర్..!

పాత్రికేయుడు పి.సునీల్ కుమార్ రెడ్డి… మొదట్లో చాలా సందశాత్మకమైన సినిమాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా అదే జోనర్ లో కొనసాగాడాయన. షార్ట్ ఫిల్మ్ లతో మొదలు పెట్టి.. ఫీచర్ ఫిలిమ్…

పాత్రికేయుడు పి.సునీల్ కుమార్ రెడ్డి… మొదట్లో చాలా సందశాత్మకమైన సినిమాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా అదే జోనర్ లో కొనసాగాడాయన. షార్ట్ ఫిల్మ్ లతో మొదలు పెట్టి.. ఫీచర్ ఫిలిమ్ ల వరకూ ఆయన సందేశాత్మక ధోరణినే కొససాగారు. అందుకు తగ్గట్టుగా ఆ సందేశాత్మక సినిమాలకు అవార్డుల పంట పండింది. వరసగా నంది అవార్డులు సొంతం అయ్యాయి. ఇలా ప్రత్యేకధోరణిలో కొనసాగారు సునీల్ కుమార్ రెడ్డి. అయితే అలా అవార్డులు దక్కినా ఆయనకు ఎక్కడా కమర్షియల్ హిట్ లభించలేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆయనకు డబ్బులు తెచ్చిపెట్టలేదు. అయినప్పటికీ కొంత కాలం అదే పరంపరను కొనసాగించిన సునీల్ కుమార్ రెడ్డి కొంత కాలం కిందట అనూహ్యంగా రూటు మార్చారు.

'ఒక రొమాంటిక్ క్రైమ్  కథ'' పేరుతో ఒక సెమీ బూతు సినిమాను రూపొందించాడు. ఇందులో ఇచ్చింది కూడా సందేశమే అయినా.. విమర్శలు ఎక్కువ వచ్చాయి. అయితేనేం కమర్షియల్ గా వర్కవుట్ అయ్యింది. సునీల్ కుమార్ రెడ్డికి కరువును తీర్చింది. అంత వరకూ సునీల్ కుమార్ రెడ్డి సినిమాలను గమనించిన వారు 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'' మూవీని చూసి ఆశ్చర్యపోయారు ఈయనేంటి ఇలాంటి సినిమా తీశాడనుకున్నారు. మరి అలా కమర్షియల్ సినిమాల రుచి మరిగిన సునీల్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కూడా అలాంటి దోరణినే కొనసాగించాడు.

“ఒక క్రిమినల్ ప్రేమకథ'' 'నేనేం చిన్నపిల్లనా'' వంటి సినిమాలతో కొంచెం సందేశం ఇస్తూ కమర్షియల్ టచ్ ఇచ్చాడు. వీటిలో 'ఒక క్రిమినల్ ప్రేమకథ'' పై తీవ్రమైన విమర్శలే వచ్చాయి. మరి ఏమైందో కానీ.. ఇప్పుడు ఉన్నట్టుండి సునీల్ కుమార్ రెడ్డి మళ్లీ తన పాతదారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'గల్ఫ్' అనే సినిమాను రూపొందించాడు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల జీవితాల్లోని కష్టాలను వివరించే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించినట్టుగా సమాచారం. మరి ఇది సునీల్ కుమార్ రెడ్డి నడిచిన పాత దారి అని చెప్పవచ్చు. మొదట్లో తీసినట్టుగా కష్టాలు, కన్నీళ్లతో కూడిన రియాలిస్టిక్ మూవీ తీస్తున్నాడాయన. మరి దీనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి!