Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమన్నా.. ఐటమ్ అంటే అతడి కోసం మాత్రమేనా..!

తమన్నా.. ఐటమ్ అంటే అతడి కోసం మాత్రమేనా..!

బెల్లంకొండ సాయి ని భారీ స్థాయిలో లాంచ్ చేసిన "అల్లుడుశీను'' సినిమాకు తమన్నా ఒక ప్రధాన ఆకర్షణ అయ్యింది. హీరోయిన్ గా లీడింగ్ లో ఉన్న ఆమె చేత ఐటమ్ సాంగ్ చేయించి తన తనయుడి సినిమాకు భారీ తనాన్ని తీసుకొచ్చాడు బెల్లంకొండ సురేష్. తనయుడిని భారీ ఎత్తున లాంఛ్ చేయాలనే తాపత్రయంతో సమంతను  హీరోయిన్ గా, తమన్నాను ఐటమ్ గర్ల్ గా చేయించాడు సురేష్. ఆ భామలను అలా తన తనయుడి పక్కన మెరిపించడానికి ఆయన చేతి చమురు బాగానే వదిలింది కూడా.

మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. 'అల్లుడు శీను' తర్వాత మళ్లీ ఐటమ్ సాంగ్స్ లో కనిపించిన దాఖలాలు లేని తమ్మూ మరోసారి అలా మెరవడానికి సిద్ధం అవుతోందని సమాచారం. మరింత విశేషం ఏమిటంటే.. ఈ సారి కూడా ఆమె మళ్లీ సాయి పక్కనే ఐటమ్ పాటను చేయబోతుండటం. హీరోయిన్ గా కెరీర్ ను జోరుగా కొనసాగిస్తున్న సమయంలోనే సాయి పక్కన నర్తించిన ఈ భామ.. మళ్లీ అతడి పక్కనే ఐటమ్ గర్ల్ గా కనిపించబోతోంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సాయి హీరోగా రూపొందుతున్న సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేయబోతోందని సమాచారం

ఒక తమిళ సినిమాకు రీమేక్ గా వస్తున్న దీంట్లో తమన్నా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుందని ఈ సినిమా యూనిట్ వాళ్లు అంటున్నారు. అయితే ఇంకా తమన్నాతో ఐటమ్ సాంగ్ కు సంబంధించి అధికారికంగా ఒప్పందం జరగలేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?