గుణశేఖర్ కు అస్వస్థత?

దర్శక నిర్మాత గుణశేఖర్ అస్వస్థతకు గురయ్యారా? ఈ మేరకు ఓ వార్త వినిపిస్తోంది. ఎంతవరకు నిజం అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, గుణశేఖర్ ను ఆయన భార్య ఆసుపత్రికి తీసుకురావడం చూసిన కొందరు…

దర్శక నిర్మాత గుణశేఖర్ అస్వస్థతకు గురయ్యారా? ఈ మేరకు ఓ వార్త వినిపిస్తోంది. ఎంతవరకు నిజం అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, గుణశేఖర్ ను ఆయన భార్య ఆసుపత్రికి తీసుకురావడం చూసిన కొందరు ఫోన్ ల్లో చెప్పడంతో ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇంకా ఖరారు కావాల్సి వుంది. 

గుణశేఖర్ పని వత్తిడికి గురయ్యారని వినికిడి. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుద్రమదేవి సినిమా ఈ నెలాఖరుకు విడుదల కావాల్సి వుంది. సుమారు 70 కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో బాహుబలి మాదిరిగానే దీన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.