రెండో రోజూ బాహుబలి ఓకె

బాహుబలి కలెక్షన్లు రెండో రోజు కూడా స్టడీగానే వున్నాయి. దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిద కోట్ల మధ్య తెలుగు వెర్షన్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. తోలిరోజు తెలుగు వెర్షన్ పాతిక నుంచి ముఫై కోట్ల…

బాహుబలి కలెక్షన్లు రెండో రోజు కూడా స్టడీగానే వున్నాయి. దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిద కోట్ల మధ్య తెలుగు వెర్షన్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. తోలిరోజు తెలుగు వెర్షన్ పాతిక నుంచి ముఫై కోట్ల మధ్య షేర్ వసూలు చేసింది. అయితే ఇందులో మినిమన్ గ్యారంటీలు, అడ్వాన్స్ లు, బెనిఫిట్ షోలు అన్నీ కలిసి వుంటాయి. రెండో రోజు తొమ్మిది కోట్ల వరకు వసూలు చేయడం అంటే చెప్పుకోదగ్గ అంశమే. 

ఆదివారం, సోమవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం వుంది. అంటే అంటే కేవలం నాలుగు రోజులకే యాభై కోట్ల మార్కు దాటే సినిమాగా బాహుబలి నిలిచిపోతుంది. ఆ తరువాత కూడా ఇదే ట్రెండ్ కొనసాగిన పక్షంలో అసలు సమీప భవిష్యత్ లో ఎవరూ అందుకోలేని రికార్డులు సృష్టిస్తుంది. అతిసులువుగా వందకోట్ల మార్కును దాటేస్తుంది. 

రంజాన్ సెలవు కూడా బాహుబలికి కలిసి వచ్చే అంశమే. 16న మరే సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు. అందువల్ల అది కూడా ప్లస్ పాయింట్. అంటే దాదాపు రెండు వారాల పాటు సోలోగా, భారీగా థియేటర్లలో నిల్చుంటుంది బాహుబలి. అయితే బాలీవుడ్ లో మాత్రం ఆశించన  మేరకు కలెక్షన్లు లేవు 40 నుంచి 50 శాతమే కలెక్షన్లు వున్నాయని వినికిడి.