చంటిగాడు..లవ్ లీ వంటి సినిమాలో అభిరుచి వున్న లేడీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న బి. జయ తన తదుపరి సినిమాకు టైటిల్ రిజిస్టర్ చేసారు. వైశాఖం అనే ఫీల్ గుడ్ టైటిల్ ను ఈసారి ఎంచుకున్నారు. అర్బన్ అపార్ట్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ మంచి ప్రేమకథను ఈ పేరుతో తెరకెక్కిస్తున్నారు.
Advertisement
ఇందుకోసం ఆమె ఓ కొత్త హీరోను పరిచయం చేస్తారని వినికిడి. అలాగే వీలయితే అప్ కమింగ్ హీరోను లేదంటే, కొత్త హీరోయిన్ ను ఎంచుకుంటారు. మరో నెలరోజుల్లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇంతకు ముందు అనుకున్న తొక్కుడబిళ్ల, అలాగే ఇంకో సబ్జెక్ట్, రెండింటినీ వైశాఖం తరువాత ఆరంభిస్తారు.