హీరోగారి కూతురులోని కొత్త యాంగిల్ ఇది..!

సోనమ్ కపూర్ అంటే.. కొంతమందికి కామెడీ అయిపోయింది. తండి నేపథ్యంలో సినిమాల్లోకి వచ్చి… హీరోయిన్‌గా సత్తా చాటడానికి ఈ భామ శతధా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలే ఆమెను కొంతమంది దృష్టిలో తేలిక చేశాయి.…

సోనమ్ కపూర్ అంటే.. కొంతమందికి కామెడీ అయిపోయింది. తండి నేపథ్యంలో సినిమాల్లోకి వచ్చి… హీరోయిన్‌గా సత్తా చాటడానికి ఈ భామ శతధా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలే ఆమెను కొంతమంది దృష్టిలో తేలిక చేశాయి. ఇక సోనమ్ ఎక్స్‌పోజింగ్‌ను చూసి కూడా కొంతమంది ఆశ్చర్యపోతూ వస్తున్నారు. సరైన హిట్ లేకపోవడం కూడా ఈ అమ్మాయికి బాలీవుడ్‌లో విలువ పెరగకపోవడానికి కారణం అయ్యింది.

మరి ఇలా కెరీర్‌ను లాగిస్తున్న సోనమ్ ఇప్పుడు తనలోని కొత్త యాంగిల్‌ను ఆవిష్కరిస్తోంది. తనకు లిటరేచర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకొంటూ ఆమె వార్తల్లోకి వచ్చింది. ఆ మధ్య జైపూర్ లిటరరీ ఫెస్టివల్‌కు వెళ్లివచ్చినప్పటి నుంచి సోనమ్ పుస్తకాల పురుగుగా మారిపోయిందట! పుస్తకాలపై తనకున్న అభిమానాన్ని చాటుకొంటోంది. లిటరరీ ఫెస్టివల్ అనేక మంది రచయితలను కలిసిన అనుభవాలను గొప్పగా వివరించుకొంటోంది. 

మరి పుస్తకాలు.. రచయితల గురించి మాట్లాడటం అంటే ఒక మెట్టు పైకి ఎక్కడమే. ఇప్పుడు సోనమ్ కూడా అదే చేసింది. మరి ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. త్వరలోనే సోనమ్ కలం పట్టనున్నదట.. రచయితగా మారి పుస్తకాలు, నవలలు రచించనున్నదట! మరి పుస్తకాలను చదువుతాను అని చెప్పుకోవడం వరకూ బాగానే ఉంది కానీ.. ఇలా రచయితగా మారిపోతాను అని సోనమ్ ప్రకటించుకోవడం మాత్రం కొంత విడ్డూరంగా ఉంది!