ప్రతినిధి-2లో పొలిటికల్ టచ్ ఉంటుందా?

నారా రోహిత్ రీఎంట్రీ ఇస్తున్నాడు. తన కమ్ బ్యాక్ సినిమా కోసం అతడు పొలిటికల్ మూవీని సెలక్ట్ చేసుకున్నాడు. ఈరోజు దీనికి ప్రతినిధి-2 అనే టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్…

నారా రోహిత్ రీఎంట్రీ ఇస్తున్నాడు. తన కమ్ బ్యాక్ సినిమా కోసం అతడు పొలిటికల్ మూవీని సెలక్ట్ చేసుకున్నాడు. ఈరోజు దీనికి ప్రతినిధి-2 అనే టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ తీయబోతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఈ సినిమా హీరో టీడీపీ మనిషి, ఇక ఈ సినిమా దర్శకుడు కూడా టీడీపీ మనిషే.

నారా రోహిత్ గురించి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. దర్శకుడి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీవీ5 మూర్తి ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు. సరిగ్గా ఇక్కడే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మహి వి రాఘవ్, యాత్ర-2 తీస్తున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ  వ్యూహం అనే సినిమాను తీస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వైసీపీకి మద్దతుగా ఉండబోతున్నాయి. వీటికి పోటీగా టీడీపీకి మద్దతుగా ప్రతినిధి-2 సినిమా వస్తుందనే టాక్ నడుస్తోంది.

అయితే యూనిట్ మాత్రం ప్రస్తుతానికి ఈ వాదనను ఖండిస్తోంది. కాస్త పొలిటికల్ టచ్ ఉన్నప్పటికీ, సామాజిక అంశాల్ని మాత్రమే టచ్ చేశామని, ఏ పార్టీకి మద్దతుగానో, వ్యతిరేకంగానో ఈ సినిమాను తీయలేదని అంటున్నారు.

వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలోకి వస్తోంది ప్రతినిధి-2 మూవీ. అప్పటివరకు ఈ సస్పెన్స్ తప్పదేమో.