రాజమౌళిపై బాధ్యత పదింతలైంది.!

'విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా సినిమా అత్యద్భుతం.. భారతీయ తెరపై ఇంత గ్రాండ్‌ లుక్‌తో సినిమా ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు..' ఇలాంటి ప్రశంసలు 'బాహుబలి'పై ఎన్ని వున్నా, 'రాజమౌళి మార్క్‌' ఎమోషన్‌, సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యే…

'విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా సినిమా అత్యద్భుతం.. భారతీయ తెరపై ఇంత గ్రాండ్‌ లుక్‌తో సినిమా ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు..' ఇలాంటి ప్రశంసలు 'బాహుబలి'పై ఎన్ని వున్నా, 'రాజమౌళి మార్క్‌' ఎమోషన్‌, సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యే గ్రిప్‌, సినిమాలో పేస్‌.. ఇవన్నీ లేకపోవడం 'బాహుబలి' సినిమా చూసిన చాలామంది ప్రేక్షకుల్ని నిరాశపర్చింది. 

రెండు పార్టులుగా సినిమా తీయడం వల్ల వచ్చిన సమస్య.. అని రాజమౌళిని అందరూ అర్థం చేసుకుంటున్నారు. అయ్యిందేదో అయిపోయింది.. ఇక ఇప్పుడు రాజమౌళిపై బాధ్యత పదింతలైంది. 'బాహుబలి' నెక్స్‌ట్‌ పార్ట్‌ని గ్రాఫిక్స్‌ వండర్‌గానూ, సినిమా పరంగానూ అత్యద్భుతంగా తీర్చిదిద్దాల్సి వుంది. రాజమౌళి ఎప్పుడంటే అప్పుడు.. అంటూ ప్రభాస్‌, రాణా ఇప్పటికే తమ సంసిద్ధతను తెలియజేశారు. 

ఇప్పుడే దర్శకుడి అసలు సిసలు సత్తా ఏంటో తెలిసిపోతుంది. ఒత్తిడి వున్నప్పుడు దాన్ని జయించగలిగినోడే అసలైన ధీరుడు. దర్శక ధీరుడు, జక్కన్న.. అనిపించుకున్న రాజమౌళి, 'బాహుబలి' పార్ట్‌ 2ని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడో వేచి చూడాల్సిందే.