బాహుబలి ఎందుకిలా?

బాహుబలి సినిమాకు మొదటి నుంచీ డిస్కషన్ లో వున్న పాయింట్లలో భారీ పర్సనాలిటీలు ఒకటి. ప్రభాస్, రానా, సత్యరాజ్, ఇంకా చాలా మంది ఈ సినిమా కోసం భారీ పర్సనాలిటీలు సాధించారు. పైగా దీని…

బాహుబలి సినిమాకు మొదటి నుంచీ డిస్కషన్ లో వున్న పాయింట్లలో భారీ పర్సనాలిటీలు ఒకటి. ప్రభాస్, రానా, సత్యరాజ్, ఇంకా చాలా మంది ఈ సినిమా కోసం భారీ పర్సనాలిటీలు సాధించారు. పైగా దీని వల్ల ప్రభాస్ మరే సినిమా చేయకుండా అయిపోయింది. అయితే తీరా మొదటిభాగం చూసాక, ఇందుకోసమా ఈ హీరోను మూడేళ్లు బ్లాక్ చేసింది..అన్న అనుమానం కలిగింది.

నిజానికి ప్రభాస్ సహజంగానే మంచి హైట్, వెయిట్, మంచి ఫిజిక్ తో కనిపిస్తాడు. ఆ బాడీ తొలిభాగంలో చూసిన మేరకు సరిపోతుందనే అనిపిస్తుంది. మరీ కావాలంటే సిక్స్ పాక్ చాలేమో అనిపిస్తుంది. శివలింగం ఎత్తిన సందర్భంలో తప్ప, ప్రభాస్ భారీ పర్సనాలిటీ వ్యవహారం, జనాలకు ఎక్కడా కనిపించదు. రానా కూడా అంతే. దున్నతో ఫైట్ చేసే ఒక్క సన్నివేశంలో తప్ప, మరెక్కడా ఆయన హెవీ పర్సనాలిటీ కనిపించదు.  పైగా ఫైట్లు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి తప్ప, మరీ అద్భుతమైన బాడీ ఫీట్లు లేవు. 

కత్తులు, ఈటెలు వంటి వ్యవహారాలే ఎక్కువ. బాడీ పెంచడం తగ్గించడం అన్నది కేవలం తండ్రీ కొడుకుల పాత్రల్లో వైరుధ్యం కోసమే అయితే అది వృధానే. ఆహార్యంలో, మేకప్ లో తేడాతో సరిపెట్టేస్తే పోయేది. ఈ మాత్రం దానికి ప్రభాస్ బాడీపై ప్రయోగాలు చేసి. మూడేళ్లు ఎందుకు బ్లాక్ చేసి, కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేయకుండా ఎందుకు చేసారా అని అభిమానులు అనుమానపడుతున్నారు. 

ఎందుకంటే బాహుబలి సినిమాకు క్రేజ్ రావడంతో ప్రభాస్ పాత్ర వుండొచ్చు కానీ, సినిమా క్రెడిట్ రాజమౌళికే వెళ్తుంది. ఇది ఇవ్వాళ కొత్తకాదు,. రాజమౌళి సినిమాలన్నింటికీ అంతే. అలాంటపుడు ప్రభాస్ ఈ సినిమాకు ముందు రెండు మూడు మాస్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటే, ఆయన మార్కెట్ మరింత పెరిగేది. ఆ అవకాశం పూర్తిగా మిస్సయ్యాడు. ఇప్పుడు కూడా మరో ఏడాది, ఏడాదిన్నర వరకు ఆ చాన్స్ కనిపించడం లేదు. ఇది ఒక్కటే అభిమానులను బాధిస్తున్న విషయం.