ఊపిరి పీల్చుకున్న బాహుబలి టీమ్

మొత్తానికి ఓ పండుగ వాతావరణాన్ని, ఓ న్యూఇయర్ సెలబ్రేషన్లను గుర్తుచేసిన బాహుబలి విడుదల కార్యక్రమం ముగిసింది. సినిమాను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అని బాహుబలి యూనిట్ కీలక సభ్యులు చాలా టెన్షన్ పడ్డారు.…

మొత్తానికి ఓ పండుగ వాతావరణాన్ని, ఓ న్యూఇయర్ సెలబ్రేషన్లను గుర్తుచేసిన బాహుబలి విడుదల కార్యక్రమం ముగిసింది. సినిమాను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అని బాహుబలి యూనిట్ కీలక సభ్యులు చాలా టెన్షన్ పడ్డారు. పైకి ఎన్ని చెప్పినా ఇది వాస్తవం. ఎందుకంటే రెండుభాగాలు చేయడం, భయంకరమైన హైప్ రావడం కీలక కారణాలు. బాహుబలి స్పెషల్ షో ల అనంతంర వచ్చిన టాక్, విడుదల అనంతరం వచ్చిన సమీక్షలు,  సాయంత్రానికి నెలకొన్న పరిస్థితి కలిసి బేరీజు వేసుకుంటే, ఇప్పుడు బాహుబలి టీమ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనే చెప్పాలి. స్పెషల్ షో ల అనంతరం నెగిటివ్ టాక్ ఫ్రారంభమైంది. సమీక్షలు ఏవరేజ్ సినిమా అన్న టైపులో వచ్చాయి. 

అయితే ఇవేవీ, సినిమాను చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తిని ఏ మేరకు కూడా తగ్గించలేకపోయాయన్నది సాయంత్రానికి స్పష్టమైంది. నైజాంలో సోమవారం వరకు టికెట్ దాదాపుగా అయిపోయాయి. అంటే వందలాది స్క్రీన్లు, వేలాది షోలు, దాదాపు ఫుల్ అయినట్లే. అది కూడా నాలుగు రోజులకు. అంటే దాదాపు సగానికి పైగా రికవరీ అయిపోతుంది అని అంచనాలు వేస్తున్నారు. కాస్త భారీ మొత్తం అన్నది నైజాంలోనే. మిగిలినవన్నీ పీస్ మీల్ పద్దతిలో అమ్మినవే. 

విశాఖ, ఈస్ట్, వెస్ట్,కృష్ణ,గుంటూరు,నెల్లూరు..ఇవన్నీ కూడా అమ్మిన మొత్తాలను, వేస్తున్న షోలను, వస్తున్న రెస్పాన్స్ ను చూసుకుంటే, బయ్యర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ సమస్య ఎదుర్కునే పరిస్థితి కనిపించడం లేదు.పైగా ఆంధ్ర ప్రాంతంలో చాలా థియేటర్లరలో యూనిఫారమ్ రేటు 100 గా నిర్ణయించి విక్రయిస్తున్నారు. మూడు,నాలుగు రోజులు ఇలా చేసినా,ఎనిమిది రోజుల కలెక్షన్లు వచ్చినట్లు. ఎందుకంటే అది టికెట్ రేటు కన్నా డబుల్ కు పైనే కాబట్టి. 

అయితే ఇదంతా ఒక ఎత్తు. టాలీవుడ్ లో నిర్మాతలు ఊహించినట్లు వంద కోట్ల వరకు రావడానికి అవకాశం ప్రస్తుతానికైతే వుంది. ఎందుకంటే, ఈ స్క్రీన్లు, ఈ లెక్కల ప్రకారం తొలివారానికి 60 దాటేయాలి. అయితే బాహుబలి యూనిట్ కు ఇంకో టెన్షన్ మాత్రంమిగిలే వుంది. మొదట్నించీ అదే టెన్షన్ వారిని వెంటాడుతోంది. ఎందుకంటే కేవలం తెలుగు బ్లక్ బస్టర్ అయినంత మాత్రాన సరిపోదు. బాలీవుడ్ లో కనీసం యాభై వస్తేనే సినమా గట్టెక్కుతుంది. అది అసలు సమస్య. 

ఇప్పుడు వచ్చిన అవుట్ పుట్, ఈ టాక్ ను బట్టి, బాలీవుడ్ ప్రేక్షకులు..అంటే ముంబాయి మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులని కాదు, వివిధ రాష్ట్రాల సాంప్రదాయ హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను ఏ మేరకు ఆదరిస్తారన్నది చూడాలి. బాలీవుడ్ ట్రేడ్ లెక్కల ప్రకారం హిందీ వెర్షన్ యాభై శాతం ఫుల్స్ అందుకుందని తెలుస్తోంది. పోనీ ఈ శాతమైనా తొలివారం అలా నిల్చోగలిగితే చాలు. 

తెలుగులో అయినా, హిందీలో అయినా మంగళవారం నాటికి అసలు విషయం స్పష్టమవుతుంది. ఈలోగా ఇన్నాళ్లు దానంతట అదిగా వచ్చిన ప్రచారంతో సరిపెట్టుకున్న బాహుబలి టీమ్, ఇప్పుడు స్వంత ప్రచారంపై దృష్టి సారించాల్సి వుంటుంది.