పాన్ ఇండియా క్రేజ్ నడుస్తోంది ఇప్పుడు. భారీ సినిమాలు ఒక్క లాంగ్వేజ్ లో చేస్తే వర్కవుట్ కాదు. అందుకే ఎక్కువ భాషల్లో విడుదల చేయాలి అంటే కాస్టింగ్ కూడా అలాగే వుంది.
హీరో సందీప్ కిషన్ కెరీర్ లో భారీ సినిమాగా తయారవుతున్న సినిమా మైకేల్. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ లాంటి పలు భాషల క్రేజీ నటుల ప్యాడింగ్ వున్న ఈ సినిమాను భరత్ చౌదరి, ఆసియన్ సునీల్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. దివ్యాంశ కౌషిక్ హీరోయిన్.
సందీప్ బర్త్ డే సందర్భంగా మైకేల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. చాలా ఫెరోషియస్ క్యారెక్టర్ లో, సిక్స్ ప్యాక్ తో, మెర్సీలెస్ గా కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ లో హీరో. పైగా ‘గాడ్ ఓన్లీ ఫర్ గివ్స్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతోనే హీరో క్యారెక్టరైజేషన్ అర్థం అయిపోతోంది. క్యారెక్టర్ లో వైల్డ్ నెస్ తెలియచేయడానికి వీలుగా గెటప్ లో చాలా కేర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఎక్కువ నటులు, ప్యాడింగ్ చూస్తుంటే కాస్త గట్టి కథనే ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది తమిళ దర్శకుడు రంజిత్ జయ్ కోడి.