సినిమా కథలు దెయ్యాలు, ఆత్మలు, ఫాంటసీల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. నాగ్ తొ కొత్త దర్శకుడు కళ్యాణ్ కొత్త సినిమాకు ఫాంటసీ టచ్ వుందని గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు మరి కొన్ని సంగతులు తెలిసాయి. తండ్రి ఆత్మ కొడుకులో ప్రవేశించడం లాంటి వ్వవహారం వుందట ఈ కథలో.
Advertisement
ఆత్మ పూనితే ఒకలా..పూనకుంటే మరోలా వుంటూ, హలో బ్రదర్ లాంటి కామెడీ పుడుతుందట. ఇదేదో బాగానేవుంది,. నాగ్ లాంటి పెద్ద హీరో కూడా దెయ్యం సినిమాల జోలికి వెళ్లాడంటే, టాలీవుడ్ లో దెయ్యానికి గ్లామర్, డిమాండ్ బాగానేవుంది. సారీ దెయ్యం అనకూడదేమో..ఆత్మ అనాలేమో?