కళ్యాణ్ కు దెయ్యం అచ్చొచ్చింది

నిర్మాత సి కళ్యాణ్ చాలా కాలంగా సరైన సినిమా లేక ఇబ్బంది పడుతున్న నిర్మాత. చంద్రకళ సినిమా అందించారు ఇటీవలే. రెండు కోట్ల ఖర్చు చేస్తే, నాలుగైదు కోట్లు మిగిలేలా వుంది పరిస్థితి. చాలా…

నిర్మాత సి కళ్యాణ్ చాలా కాలంగా సరైన సినిమా లేక ఇబ్బంది పడుతున్న నిర్మాత. చంద్రకళ సినిమా అందించారు ఇటీవలే. రెండు కోట్ల ఖర్చు చేస్తే, నాలుగైదు కోట్లు మిగిలేలా వుంది పరిస్థితి. చాలా దెయ్యం సినిమాల మాదిరిగానే, టాక్ తో సంబందం లేకుండా డబ్బులు వచ్చేసాయి. అందుకే ఇక చూస్కోండి నా సామిరంగా అంటున్నారు. 

మరో దెయ్యాన్ని అదే దెయ్యం సినిమాను తమిళం నుంచి తెలుగునాట తిప్పేయబోతున్నాడు. విఖ్యాత తమిళ దర్ళకుడు బాల నిర్మించిన పిశాచి సినిమా హక్కులు సి కళ్యాణ్ సంపాదించారు. తమిళం లో ఈ సినిమా బాగా ఆడుతోందని, ఇక్కడ కూడా మంచి ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు కళ్యాణ్ చెబుతున్నారు.