ముకుంద విజయయాత్ర

సినిమా అటు ఇటుగా వుంటే ఎత్తడానికి ఏకైక మార్గం విజయయాత్ర. ఇప్పుడు ముకుంద టీమ్ కూడా అదే పనిలో వున్నట్లు వినికిడి. సినిమాకు అటు ఇటు కాని టాక్ వచ్చింది. అయితే పోటీలో వున్న…

సినిమా అటు ఇటుగా వుంటే ఎత్తడానికి ఏకైక మార్గం విజయయాత్ర. ఇప్పుడు ముకుంద టీమ్ కూడా అదే పనిలో వున్నట్లు వినికిడి. సినిమాకు అటు ఇటు కాని టాక్ వచ్చింది. అయితే పోటీలో వున్న మరో సినిమా చినదాన నీ కోసం సినిమాకు మరీ బ్యాడ్ టాక్ వచ్చింది. 

పైగా మరో మూడువారాల పాటు బరిలోకి సరైన సినిమా వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ అవకాశాన్ని వాడుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. దర్శకుడు, హీరో తదితరులు విజయ యాత్రకు వెళ్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారట. 

మెగా హీరో వస్తున్నాడంటే సహజంగానే ఫ్యాన్స్ హడావుడి చేస్తారు. అందువల్ల మరి కాస్త పబ్లిసిటీ అవుతుంది. సినిమాకు కలెక్షన్ల స్టడీ అయ్యే అవకాశం వుంటుంది.