వర్రీ అవుతున్న శ్రీకాంత్ అడ్డాల

రెండు హిట్ లు కొట్టి, మూడో సినిమా దగ్గర కాస్త పల్టీ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు వర్రీ అవుతున్నాడు. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమా వుంటుందా..వుండదా అని. సినిమా విడుదలయ్యాక, ఎక్కడయినా…

రెండు హిట్ లు కొట్టి, మూడో సినిమా దగ్గర కాస్త పల్టీ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు వర్రీ అవుతున్నాడు. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమా వుంటుందా..వుండదా అని. సినిమా విడుదలయ్యాక, ఎక్కడయినా నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ఇంత బాగుంది..అన్ని కలెక్షన్లు అని ప్రకటిస్తారు. ముకుందకు మాత్రం నిర్మాతలు ముందుకు రాలేదు. 

దర్శకుడే ముందుక వచ్చి, మీడియాతో మాట్లాడి కలెక్షన్ల వివరాలు అందించారు. మొత్తం 3.40 కోట్ల కలెక్షన్లు తొలి రోజు వచ్చాయని ప్రకటించారు. అయితే ఇన్ సైడ్ వర్గాల వాస్తవ కలెక్షన్లు 2.70 కోట్లే అని అంటున్నారు. ఏది నిజమో తెలియాలంటే డైలీ కలెక్షన్ రిపోర్టులు చూడాలి. 

అవి థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, అక్కడి నుంచి నిర్మాతలకు వస్తాయి. అవి మిగిలిన వారికి అందుబాటులో వుండవు. ఈలోగా ఎంత అంటే అంతే..సరే ఈ సంగతి అలావుంచితే ఇప్పటికే ఓ ప్రయోగం సుకుమార్ తో చేసి దెబ్బ తిన్న మహేష్ బాబు మళ్లీ మరో ప్రయోగం శ్రీకాంత్ అడ్డాలతో చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఇప్పుడు శ్రీకాంత్ వర్రీకి కారణమేమో?