మున్నాభాయ్ సంజయ్‌దత్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇటీవలే ‘సెలవులపై’ జైలు నుంచి విడుదలైన సంజయ్‌దత్, తన కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఓ పక్క ఎంజాయ్ చేస్తోంటే, అతనికి ఎలా సెలవులు మంజూరు చేశారు.? అన్నదానిపై మహారాష్ట్ర సర్కార్ సిద్ధమైంది.
నిబంధనల ప్రకారమే, సరైన కారణాలతోనే సంజయ్‌దత్‌కి పెరోల్ మంజూరైందా? లేదంటే ఏమన్నా ఒత్తిళ్ళు వున్నాయా.? అన్న కోణంలో విచారణ జరగనుందట. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ళ కేసులో, అక్రమాయుధాలు కలిగివున్నాడన్న ఆరోపణలతో సంజయ్‌దత్ దోషిగా తేలాడు. ఈ కేసులోనే సంజయ్‌దత్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష పడింది.
ఇప్పటికి 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన సంజయ్‌దత్, మిగతా శిక్షను పూర్తి చేయాల్సి వుంది. తాజాగా లభించిన పెరోల్తో 15 రోజుల సెలవు దొరికింది. సెలవుల్ని ఎంజాయ్ చెయ్యడంలో భాగంగానే అమీర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని కుటుంబ సమేతంగా వెళ్ళి తిలకించాడు మున్నాభాయ్. అంతలోనే ఈ వివాదం తెరపైకొచ్చింది.