మోటా బేబీ..ముద్దు కహానీ

అనుష్క…ఈతరం హీరోయిన్లలో లాంగ్ ఇన్నింగ్స్ రికార్డు ఆమెదే. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన బాహుబలి, రాబోయే రుద్రమదేవి..ఆపై వచ్చే సైజ్ జీరో..మూడు మూడు డిఫెరంట్ సినిమాలు. సైజ్ జీరోలో ఇరవై కిలోల…

అనుష్క…ఈతరం హీరోయిన్లలో లాంగ్ ఇన్నింగ్స్ రికార్డు ఆమెదే. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన బాహుబలి, రాబోయే రుద్రమదేవి..ఆపై వచ్చే సైజ్ జీరో..మూడు మూడు డిఫెరంట్ సినిమాలు. సైజ్ జీరోలో ఇరవై కిలోల బరువు పెరిగి మోటాబేబీలా కనిపించబోతోంది అనుష్క. 

గతంలో బిల్లా, ఇంకా మరి కొన్ని సినిమాల్లో కాస్త పొదుపు దుస్తులతో కనిపించడం తప్ప, మరేవిధమైన అదుపు తప్పే వ్యవహారాల జోలికి పోలేదు. కానీ ఇప్పుడు సైజ్ జీరోలో..ఆమె అదరగొట్టే లిప్ లాక్ సీన్ చేసినట్లు వదంతి గుప్పు మంటోంది. 

ఆ సినిమాలో హీరో ఆర్య. గతంలో అనుష్కతో ఇదే పివిపి సంస్థ, అదే ఆర్యతో కలిసి వర్ణ అనే సినిమా నిర్మించిన సంగతి గుర్తుండే వుంటుంది. మరి లిప్ లాక్ నిజమే అయితే, ఆ సినిమాకు మాంచి ప్లస్ పాయింట్ అయి కూర్చుంటుంది.