మహేష్ – రాజమౌళి సినిమా వెనుక…

గల్లా జయదేవ్..సూపర్ స్టార్ కు అల్లుడు..మరో సూపర్ స్టార్ కు బావ. ఇప్పుడు ఆయనే టాలీవుడ్ ఏస్ డైరక్టర్ రాజమౌళిని, టాప్ హీరో మహేష్ బాబును కలిసి ఓ వెంచర్ చేసేలా ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్…

గల్లా జయదేవ్..సూపర్ స్టార్ కు అల్లుడు..మరో సూపర్ స్టార్ కు బావ. ఇప్పుడు ఆయనే టాలీవుడ్ ఏస్ డైరక్టర్ రాజమౌళిని, టాప్ హీరో మహేష్ బాబును కలిసి ఓ వెంచర్ చేసేలా ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గల్లాజయదేవ్ పార్లమెంటు సభ్యుడు. అంతకు మించి బడా పారిశ్రామిక వేత్త. ఆయనకు దర్శకుడు రాఘవేంద్రరావుతో సన్నిహిత అనుబంధం వుంది. 

ఆ అనుబంధంతోనే బాహుబలికి కూడా తెరవెనుక అండదండలు అందించారని టాలీవుడ్ కబుర్ల సారాంశం. ఇప్పుడు అలా కుదిరిన బాహుబలి బంధంతో, తరువాతి సినిమా మహేష్ తో రాజమౌళి చేసేలా చొరవ తీసుకున్నారని తెలుస్తోంది. దాని ఫలితమే తరువాత సినిమా మహేష్ తో వుంటుందని రాజమౌళి ప్రకటించారని కూడా తెలుస్తోంది. రాజమౌళి ముందు చాలా కమిట్ మెంట్లు వున్నాయి. ఒకటి బాహుబలి పార్ట్ 2. 

రెండవది నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయమనే ఆబ్లిగేషన్. మరి దానికి ఆయన తల వొగ్గుతారా లేదా అన్నది తెలియదు. రాజమౌళి కనుక మోక్షజ్ఞ ప్రాజెక్టు టేకప్ చేస్తే, నిర్మాతగా సాయి కొర్రపాటే వుంటారు. ఆయనకు ఓ సినిమా చేయాలని రాజమౌళి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మధ్యలో మహేష్ సినిమా వుండొచ్చు. అంటే దాదాపు మూడేళ్ల పాటు రాజమౌళి షెడ్యూలు పుల్ అయిపోయినట్లే.