రుద్రమదేవి విడుదలకు ముందు జరిగిన సంగతి ఒకటి మెల్లగా వెలుగులోకి వస్తోంది. రుద్రమదేవి దర్శక నిర్మాత గుణశేఖర్ కు హీరో చిరంజీవి ఇచ్చిన షాక్ సంగతి ఇది. సినిమా విడుదలను 9వతేదీకి ఫిక్స్ చేసుకున్నాక, బ్రూస్ లీ విషయమై మాట్లాడేందుకు చిరు ఇంటికి వెళ్లాడట గుణశేఖర్. '… వాయిస్ ఓవర్ ఇచ్చారు..చాలా చాలా థాంక్స్..చాలా కష్టాల్లో వున్నాను..ఇంట్లో రూపాయి లేదు..సమస్తం సినిమా మీద పెట్టాను..మీరు ఒక్కవారం వెనక్కు వెళ్తే సేఫ్ అవుతాను..'' అన్నాడట గుణశేఖర్.
'..అదేంటి గుణశేఖర్ అలా అంటావు..తప్పుకుండా..నేను చెబుతాను..నువ్వు వెళ్లి దానయ్యతో, సుధాకరరెడ్డితో మాట్లాడు..' అన్నాడు చిరంజీవి అని తెలుస్తోంది. సరే అని ఆనందంతో గుణశేఖర్ దానయ్య దగ్గరకు వెళ్లే సరికి, తెరవెనుక నుంచి సిగ్నల్ ఇచ్చేసి, ఆ గంటలోనే విడుదల తేదీ 16నే ఫిక్స్ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేయించేసారట. దీంతో గుణశేఖర్ అవాక్కయ్యాడట. ఇంక చేసేది లేక మిన్నకున్నాడట..
'ఇప్పుడు గుణశేఖర్ మనసులోని మాటలు ఎవరైనా రాబట్టండి..సినిమా నిర్మాణంలో ఆయన పడిన ఇబ్బందులు, ఆదుకున్నదెవరు..హ్యాండిచ్చినదెవరు..అన్నీ బయటకు తీయండి..ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి వారో తెలిసిపోతుంది' అన్నారో నిర్మాత. గుణశేఖర్ తన ఇంట్లో ఆడపిల్లలు, భార్య పెట్టుకోవడానికి కనీసం నగలు కూడా వుంచకుండా మొత్తం సినిమా మీద పెట్టేసాడట. ఇప్పుడు సినిమా కనీసం అయిదారు కోట్లు నష్టమే మిగిల్చింది అతనికి. అదే బ్రూస్ లీ ఓ వారం వెనక్కు వెళ్లి వుంటే గట్టెక్కేసేవాడేమో?