త్రివిక్రమ్ కు నితిన్ బంపర్ ఆఫర్?

మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసి, పెద్దహీరోలతోనే సినిమాలు చేసి, హిట్ లు కొడతాడు …అన్న అపవాదు చెరిపేసుకోవాలని అనుకుంటున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఓ మాంచి ఫ్యామిలీ కమ్ హీరోయిన్ కు కాస్త…

మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసి, పెద్దహీరోలతోనే సినిమాలు చేసి, హిట్ లు కొడతాడు …అన్న అపవాదు చెరిపేసుకోవాలని అనుకుంటున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఓ మాంచి ఫ్యామిలీ కమ్ హీరోయిన్ కు కాస్త ఎక్కువ ప్రాధాన్యత వున్న సబ్జెక్ట్ దాదాపు రెడీ చేసాడు. దానికి హీరోగా ఫైనల్ లిస్ట్ లో నాగచైతన్య, నితిన్ మిగిలారు. అయితే ఈ ప్రాజెక్టు తనకు రావడం కోసం నితిన్ ఓ మాంచి ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. 

తనతో సినిమా తీస్తే..తనే ఎదురు 10 కోట్ల వరకు ఇస్తానని, తనకు నైజాం, శాటిలైట్ హక్కులు ఇస్తే చాలని, రెమ్యూనిరేషన్ కూడా అందులోనే చూసుకుంటానని అన్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  అంటే హీరో ఫ్రీగా వస్తూ, పది కోట్ల రూపాయిలు హక్కుల కింద ముందే వచ్చేస్తాయి. హీరో పారితోషికం కలుపుకుంటే పదిహేను కోట్లు అనుకోవచ్చు. ఇక సీడెడ్, ఆంధ్ర, ఓవర్ సీస్ వుండనే వుంటాయి. మహా అయితే సినిమాకు పదిహేను కోట్లు అవుతుంది. ఎలా లేదన్నా మంచి లాభం మిగుల్చుకోవచ్చు. 

అయితే ఇంకా ఏ విషయం ఫైనల్ కాలేదు. డిస్కషన్ల మీద డిస్కషన్లు నడిచి ఆఖరికి డైరక్టర్ తివిక్రమ్ కే నిర్మాత రాధాకృష్ణ ఫైనల్ డెసిషన్ వదిలేసారట. ఆయన వరకు నితిన్ అయితేనే బాగుంటుందని, అలా అయితే ఇటు నాగచైతన్య-చందు మొండేటి, అటు నితిన్-త్రివిక్రమ్ లతో రెండు సినిమాలు ఒకేసారి పట్టాలు ఎక్కించేయచ్చని వుందట. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంతవరకు మనసులో మాట బయట పెట్టడం లేదు. స్క్రిప్ట్ డిస్కషన్లలో మాత్రం అప్పుడప్పుడు పోరపాటునో, అలవాటునో, నితిన్ పేరు మాత్రం పలవరిస్తున్నారట.

ఇదిలా వుంటే హీరోయిన్ ఎవరు అన్నది కూడా క్వశ్నిన్ మార్కే. బల్క్ డేట్ లు వరుసగా ఎవరు ఇస్తారని చూస్తున్నారట. నాగచైతన్య అయితే సమంత చాయిస్ గా వుండొచ్చు. నితిన్ పక్కన కూడా ఆమె నటించలేదు. అందువల్ల అక్కడా ఆమెకు పిఫరెన్స్ వుండొచ్చు.

ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ లు ఇస్తున్నారు. ఈ వారాంతానికి అసలు విషయాలు బయటకు రావచ్చు. ఇదిలా వుంటే..నితిన్, ఆయన తండ్రి సినిమాకోసం ఇంతలా ప్రయత్నిస్తుంటే, నాగచైతన్య మాత్రమే అటు పక్క ప్రయత్నిస్తున్నాడు. నాగార్జున నోరు తెరిచి అడిగినట్లు తెలియడం లేదు. అడిగి లేదంటే అఫెండ్ కావడం ఇష్టం లేక నాగార్జున అడగలేదా? లేక అఖిల్ తో చేయించాలని వుంది కాబట్టి అడగలేదా అన్నది మాత్రం తెలియదు.