సూపర్ స్టార్ రజనీకాంత్ ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాడా.? ఏమోగానీ, ఆయన ఆస్తుల్ని వేలానికి పెడుతున్నట్లు ‘ఎగ్జిమ్ బ్యాంక్’ ప్రకటనలో వెల్లడించడం ఒక్కసారిగా అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో రజనీకాంత్. అతని తర్వాతే బాలీవుడ్ స్టార్స్ అయినా రెమ్యునరేషన్‌లో. అలాంటిది, రజనీకాంత్‌కి ఆర్థిక ఇబ్బందులేమిటి.? ఆస్తుల వేలం ఏంటి.?
ఓ సినిమా నిర్మాణం కోసం రజనీకాంత్ 22 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారట. ఆ లోన్ తీర్చడంలో విఫలం కావడంతో, హామీ కోసం పెట్టిన ఆస్తుల్ని వేలం వేయడానికి సదరు బ్యాంకు ప్రకటన ఇచ్చింది. ఆ సినిమా ‘కొచాడియాన్’ కావొచ్చని అంటున్నారు. పూర్తి వివరాలైతే ఇంకా బయటకు రాలేదు. అయితే ‘కొచాడియాన్’ సినిమా కోసం చాలా ఖర్చు చేశారు. రజనీకాంత్ కుమార్తె ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం విదితమే.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కొచాడియాన్’ ఘోరంగా ఫ్లాపయ్యి, నిర్మాతకు దారుణమైన నష్టాల్ని మిగిల్చింది. అలా ‘కొచాడియాన్’ దెబ్బతో రజనీకాంత్ ఆస్తుల వేలం ప్రకటన వచ్చిందని అనుకోవాలేమో.! అన్నట్టు, ఇటీవల రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘లింగ’ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.