దక్షిణ కాలిఫోర్నియా లోని తెలుగు వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత అభ్యున్నతి కోసం ప్రారంభించిన లాస్ ఏంజిలేస్ తెలుగు అసోసియేషన్ “లాటా” వారి ఆద్వర్యంలో గత 6 వారాలు గా ఉచిత Software Quality Assurance (QA) శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగుతులను మూడు చోట్ల ఇర్వైన్, టార్రెన్స్ , కరోనా ల లో ఏక కాలంలో నిర్వహించడం జరిగింది. 37 మంది మహిళా ఔత్సాహికులు ఈ శిక్షణా తరగుతులలో పాల్గొన్నరు.
అమెరికా అధ్యక్షుడి executive action ద్వారా H4 వీసా మీద వున్న వారికి అమెరికా లో పని చేసుకొనే వెసలుబాటు కలిపిస్తున్న సందర్భంలో లాస్ ఏంజిలేస్ తెలుగు అసోసియేషన్ “లాటా” వారు తమ సమాజ వృత్తి గత అభ్యున్నతి కోసం 20 మందికి పైగా లాటా స్వచ్చంద కార్యకర్తలు అకుంఠిత దీక్ష తో సేవయే పరమార్ధంగా తమ సాయంత్రాలని మరియు వారంతాలని ఈ QA శిక్షణ తరగతుల కోసం వెచ్చించడం చెప్పుకో దగిన విషయం.
ఈ Software Quality Assurance (QA) శిక్షణా తరగతుల ను శ్రీధర్ సాతులూరి, చక్రి కావూరి, సురేష్ అంబటి గార్లు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ఈ శిక్షణా తరగుతులలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుదీప్త పాలడుగు, వెంకట్ అట్లూరి, నందన్ పొట్లూరి, చక్రవర్తి అయ్యాల, వెంకట్ పెద్ది, శ్యాం గుమడాల, సురేష్ అయినంపూడి, రావికాంత్ పుట్టా, శ్రీహరి అట్లూరి, బసవయ్య రావి, జ్యోత్స్న వెలిదండ, హరి మదాల గార్లు వేర్వేరు విషయాల పై శిక్షణ ను ఇవ్వడం జరిగింది
లాటా ప్రారంభం నుండి వెన్నంటి ప్రోత్సహిస్తూ, వివిధ కర్యరమల్లొ ఇతోధికంగా సహాయం చేస్తున్న కిషోర్ కంఠమనేని గారు Pyramid Technology Solutions (PTS) కార్య నిర్వహణాధికారి మరియు iSpace ముఖ్య కార్య నిర్వహణాధికారి రాజేష్ కొత్తపల్లి గార్లు తమ కార్యాలయాలను వారాంతాలలో ఈ QA కార్యక్రమాల కోసం ఇవ్వడం జరిగింది.
ఈ QA శిక్షణ ముగింపు సందర్భంగా లాటా అధ్యక్షులు రమేష్ కోటమూర్తి గారు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగుతు లకు వసతులు సమ కూర్చిన కిషోర్, రాజేష్ గారి ఔన్నత్యాన్ని శ్లాషించారు. ఈ శిక్షణా తరగతులు విజయ వంతంగా నిర్వహించడానికి కృషిచేసిన శ్రీనివాస్ కొమిరిశెట్టి గారిని అభినందించారు. మరియు ఈ శిక్షణ తరగుతులలో పాల్గొన్న వారు భవిష్యత్తులో లాటా తెలుగు సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాల్లో పాల్గొనాలని విన్నవించారు. అలాగే ఈ శిక్షణ లో పాల్గొన్న వారికి జూలై నెలాంతం లో జాబ్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వారు లాటా వారు నిర్వహించిన ఈ QA కార్యక్రమం ఎంతో ఉపయోగ కరంగా ఉందనీ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు