ఎందుకంటే ప్రేమంట తరవాత చాలా కాలం కరుణాకరన్ ఖాళీగా ఉన్నాడు. ఎట్టకేలకు నితిన్ని పట్టుకొన్నాడు. ఫామ్లో ఉన్న నితిన్.. కరుణాకరన్ని అవకాశం ఎలా ఇచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు అనుకొన్నట్టే.. చిన్నదాన నీకోసం సినిమాకి బాక్సాఫీసు దగ్గర ఎదురుగాలి వీస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాకి కరుణాకరన్ మనస్ఫూర్తిగా పనిచేయలేదట. ప్రతి విషయంలోనూ నితిన్ కాంపౌండ్ అడ్డుతగులుతూనే ఉందట. కథని ఎవరు పడితేవాళ్లు కెలికిపాడేశారట. నితిన్ ఒకవైపు నుంచి, మరో వైపు నుంచి హర్షవర్థన్ (ఈసినిమాకి రైటర్) తలో చేయి వేసి సలహాలు ఇచ్చి.. నానా కంగాళీ చేశారట. కొన్ని సీన్స్ ఆండ్రూ తీసుకొన్నాడట.
అలా ఈ సినిమా కలగూరగంపలా తయారైంది. ఆలోచనలు ఎక్కువై అంచనాలను పల్టీ కొట్టించింది. ఈ సినిమా తరవాత కరుణాకరణ్ని ఛాన్స్ ఇవ్వడం కష్టమే అని ఫిల్మ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. పాపం.. కరుణాకరణ్ అందరూ కలిసి ఈ సినిమాని అన్యాయం చేస్తే.. పాప భారం ఒక్కడే మోయాల్సివస్తోంది.