Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబాయ్ బాట‌లో అబ్బాయ్‌

బాబాయ్ బాట‌లో అబ్బాయ్‌

జ‌న‌వ‌రి 1న అభిమానుల‌కు కానుక ఇవ్వబోతున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. త‌న కొత్త సినిమా టైటిల్ ఆ రోజు ప్రక‌టిస్తారు. దాంతో పాటూ టీజ‌ర్ కూడా విడుద‌ల చేస్తారు. ఇప్పుడు అబ్బాయ్ క‌ల్యాణ్‌రామ్ కూడా బాబాయ్‌ని ఫాలో అయిపోతున్నాడు. 

త‌న 'ప‌టాస్‌' ఆడియోని జ‌న‌వ‌రి 1న విడుద‌ల చేస్తానంటున్నాడు. క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'ప‌టాస్‌'. ఈనెల 17నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల్సింది. కానీ.. నంద‌మూరి జాన‌కీరామ్ మ‌ర‌ణంతో వాయిదా ప‌డింది. 1వ తేదీన నేరుగా ఈ పాట‌ల్ని ఇంట‌ర్నెట్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. 

అన్నీకుదిరితే... జ‌న‌వ‌రి 9న 'ప‌టాస్‌'ని సిద్ధం చేస్తారు. లేదంటే జ‌న‌వరి మూడో వారంలో ప‌టాస్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. మాస్‌, యాక్షన్ అంశాలు క‌ల‌గ‌లిపిన క‌థ ఇది. క‌ల్యాణ్‌రామ్ పోలీస్ అధికారిగా న‌టించాడు. బాబాయ్ , అబ్బాయ్‌ల కానుక‌లు ఎలా ఉంటాయో, అభిమానుల్ని ఏ రేంజులో అల‌రిస్తారో..??

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?