రాజమౌళిపై మీడియా నిరసన

బాహబలి ప్రమోషన్లు, ఇంటర్వూలు ఇతర కార్యక్రమాల్లో కేవలం కొంత మంది మీడియాను మాత్రమే పిలవడం, మిగిలిన వారిని పట్టించుకోకకోవడం పై నిరసన వ్యక్తమవుతోంది. అది ఈ రోజు రాజమౌళి ఎదుటే మీడియా జనాలు వ్యక్తం…

బాహబలి ప్రమోషన్లు, ఇంటర్వూలు ఇతర కార్యక్రమాల్లో కేవలం కొంత మంది మీడియాను మాత్రమే పిలవడం, మిగిలిన వారిని పట్టించుకోకకోవడం పై నిరసన వ్యక్తమవుతోంది. అది ఈ రోజు రాజమౌళి ఎదుటే మీడియా జనాలు వ్యక్తం చేసారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, అలాగే టాప్ త్రీ టు ఫోర్ చానెళ్లు, టాప్ త్రీ టు ఫోర్ వెబ్ సైట్ల ను మాత్రమే పిలుస్తున్నారు. ఆంధ్రభూమి, సూర్య, ఆంధ్ర ప్రభ, వార్త ఇంకా ఇలాంటి అనేక పత్రికలను పక్కన పెట్టేసారు. అలాగే చాలా చానెళ్లను పట్టించుకోనే లేదు. 

కానీ ఈ రోజు పైరసీ మీట్ కు మాత్రం అందర్నీపిలిచారు. ' మీ అవసరం వుంటే, అందర్నీ పిలుస్తారు..లేదంటే కొందర్నే పిలుస్తారా..ఇప్పుడు కూడా ఆ నలుగుర్నే పిలచి మాట్లాడలేకపోయారా? అంటూ మీడియా జనాలు నిలదీసారు. దీంతో రెండు రోజుల నుంచే ప్రమోషన్లు ప్రారంభించామని,అందరికీ అవకాశం ఇస్తామని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు నిర్మాత శోభు. కానీ మీడియా జనాలు వినలేదు. అందరూ ప్రచురించిన తరువాత తమకేం మిగుల్తుందని ఎదురుప్రశ్నించారు. దీంతో ఇంక ఇది ముదిరేలా వుందని అరవింద్, శొభు, రాజమౌళి, రానా, స్టేజి దిగి వెళ్లిపోయారు. 

సినిమా తేడా వస్తే, అప్పుడు మళ్లీ అందరూ కావాల్సి వస్తుందన్న కామెంట్ లు వినిపిస్తుండగా మీడియా మీట్ ముగిసింది.