పైరసీకి మూల కారణం సినిమా థియేటర్ ఆపరేటర్లే అని రాజమౌళి అనుమానపడుతున్నారు. అందుకే థియేటర్ యజమానులు తమ తమ ఆపరేటర్లపై ఓ కన్నేసి వుంచాలని కోరారు. షోలు అయిపోయాక, ప్రొజక్టర్ రూమ్ కు తాళం వేసుకోవాలని కోరారు. అలాగే అర్థరాత్రి థియేటర్ ఖాళీగా వున్నపుడు ఆపరేటర్లు షో వేసుకుని పైరసీ చేస్తారని అనుమానం వ్యక్తం చేసారు.
కానీ అల్లు అరవింద్ మాత్రం, పైరసీ ఏ థియేటర్ లో ఏ క్షణంలో చేసినా తెలుసుకునే ఫోర్సెనిక్ పరిజ్ఞానం తమ దగ్గర వుందని (అబ్బో..నిజమా?) అందువల్ల ఆ ధియేటర్ ను ఏడాది పాటు బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. మరి నిజంగా అంత పరిజ్ఞానం వుంటే, ఈ హడావుడి అంతా ఎందుకు..గమ్మున పని కానివ్వక. ఈ తాటాకు చెప్పుళ్లకు పైరసీ జనాలు భయపడతారా? డౌటే?