రాశీ ఖన్నా కెవ్వు కేక

ముద్దుగుమ్మ.. బొద్దుగుమ్మ.. క్యూట్‌ క్యూట్‌ బ్యూటీ.. బబ్లీ బబ్లీ గర్ల్‌.. ఇలా చాలానే ప్రస్తావనలు ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా టైమ్‌లో రాశీ ఖన్నా గురించి వచ్చాయి. ‘జోరు’ సినిమాతో ఈ బబ్లీ బ్యూటీ మరింతగా…

ముద్దుగుమ్మ.. బొద్దుగుమ్మ.. క్యూట్‌ క్యూట్‌ బ్యూటీ.. బబ్లీ బబ్లీ గర్ల్‌.. ఇలా చాలానే ప్రస్తావనలు ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా టైమ్‌లో రాశీ ఖన్నా గురించి వచ్చాయి. ‘జోరు’ సినిమాతో ఈ బబ్లీ బ్యూటీ మరింతగా టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ‘జిల్‌’ సినిమాతో జిగేల్‌ జిగేల్‌ మనిపించేసేలా హాట్‌ టాపిక్‌ అపోయింది.

‘జిల్‌’ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది సెన్సార్‌.. అనగానే, సినిమాలో రాశీఖన్నా రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్‌ చేసేసిందనే ఊహాగానాలు తెరపైకొచ్చాయి. సినిమా పోస్టర్స్‌ కూడా చాలా హాట్‌ హాట్‌గా వున్నాయి. లిప్‌ టు లిప్‌ కిస్‌లు వున్నానీ, టూ పీస్‌ బికినీలోనూ రాశీఖన్నా దుమ్మురేపేసిందనీ చెప్పుకుంటున్నారు టాలీవుడ్‌లో.

అసలు ‘జిల్‌’లో ఏముందోగానీ, రిలీజ్‌కి ముందు ఈ హాట్‌ పబ్లిసిటీతో ఒక్కసారిగా సినిమాకి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడుతోంది. ‘లౌక్యం’తో హిట్‌ అందుకున్న గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. అబ్బో.. నటనలో అదుర్స్‌ అని గోపీచంద్‌ కూడా కితాబులిచ్చేశాడు రాశీ ఖన్నాకి. యాక్టింగ్‌ టాలెంట్‌ ఏమోగానీ, అందాల విందుతో టాలీవుడ్‌ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న రాశీ ఖన్నా తెరపై ఏ రేంజ్‌లో గ్లామర్‌ పండించిందో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.