రభస హిట్ లేదా ఏవరేజ్ అన్న డిస్కషన్ పక్కన పెడితే, కలెక్షన్లు ఏమేరకు అన్నది అనుమానంగా వుంది. తొలి రోజు షేర్ తొమ్మిదికోట్లకు కాస్త దగ్గరగా వచ్చాయని అంటున్నారు. కానీ అది షేర్ కాదు గ్రాస్ అని కొందంటున్నారు. మరి కొందరు తొమ్మిది కాదు ఏడు అంటున్నారు. ఈ సంగతి ఎలా వున్నా, రెండో రోజు, మూడో రోజు వరుసగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది.
దీనికి సినిమాపై వచ్చిన టాక్ ఒక కారణం కాగా, రాష్ట్రం అంతటా, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు ఇంకో కారణం,. ఇక రభస ఎంత కుమ్ముకున్నా నాలుగు రోజులే మిగిలి వుంది,. అయిదో రోజు పవర్ విడుదలవుతుంది. రవితేజ సినిమా అంటే అదీ మాస్ ఎంటర్ టైనర్ గానే వుంటుంది కాబట్టి కాస్త గట్టిపోటీ ఎదురవ్వచ్చు.
టాక్ ఎలా వున్నా, తొలి మూడు రోజులు మూడు తొమ్మిదులు వసూలు చేసి, లాంగ్ రన్ లో నలభై కోట్ల క్లబ్ లో చేరిపోతుంది రభస అనుకున్నారు. కానీ ఇప్పటి పరిస్థితులు గమనిస్తుంటే అది కష్టంగా కనిపిస్తోంది. సినిమా ఖర్చు ముఫై అయిదు వరకు అయినట్లు తెలుస్తోంది.