మహేష్ బాబు, శ్రీనువైట్లు కాంబినేషన్ లోని ఆగడు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. విడుదల తేదీ అధికారికంగా ప్రకటించకపోయినా, మరో ఇరవై రోజులు కూడా లేదన్నది అనధికార వార్తల సారాంశం. ఇంతవరకు ఈ సినిమా అమ్మకాలు ఇంకా షురూ కాలేదు. ఇప్పుడు ఆగడు ఫీవర్ పీక్ కు చేరుకుంది కాబట్టి, ఇక అమ్మకాలు మొదలవుతాయి. ఆగడు ఖర్చు 65 కోట్లు అని వార్తలైతే వినివస్తున్నాయి.
14రీల్స్ సంస్థ దగ్గర పలువురు డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్సులు కాస్త పెద్ద మొత్తంలోనే వున్నాయని వినికిడి. ఈ మొత్తం 10 నుంచి 15 కోట్ల వరకు వుంటాయని అంటున్నారు. వీటన్నింటిని లెక్కించుకుని అమ్మకాలు సాగాల్సి వుంటుంది. అయితే ఆగడు క్రేజ్ వీర లెవెల్లో వుంది కాబట్టి అమ్మకాలకు ఢోకా వుండదు. కానీ కలెక్షన్లు అందరి లాభాలు, లెక్కలు చూసుకుంటే 80కోట్లు దాటాల్సిందే. అదే జరిగితే ఆగడు సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతుంది.